గ్రేటర్ ఎన్నికల సమరానికి తెరపడే సమయం రానే వచ్చింది. ఈ రోజు ఫలితాలు లెక్కింపు జరగనుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ ఓట్లు పూర్తిగా ప్రత్యక్ష ఓటింగుకు దూరంగా ఉన్న వారు మాత్రమే ఈ పద్దతిలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అంటే వివిధ ప్రదేశాలలో ఉద్యోగ నిర్వహణలో భాగంగా, లేదా కార్మికులుగా వెళ్లి ఉన్నా లేదా ఇంకేమైనా కారణాల వలన ఎన్నికలకు హాజరు కానివారు, తమ ఓటును పోస్ట్ ద్వారా పంపుతారు. ఈ ఓట్లు అత్యధికంగా ఉండే అవకాశం లేదు కాబట్టి ముందుగా వీటిని లెక్కించి వేస్తే ఒక పనైపోతుందని అధికారులు నిర్ణయించుకున్నారు. అయితే ఇందులో ఆశ్చర్యకరంగా బీజేపీ ఆధిక్యంలో ఉండడం తెరాసకు చెమటలు పట్టిస్తున్నాయి.

ఇప్పటివరకు లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా తెరాస రెండో స్థానంలో ఉంది. మొత్తంగా 74 డివిజన్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది, అలాగే తెరాస 35 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం 15 మరియు కాంగ్రెస్ 1 డివిజన్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే టీడీపీ ఇంకా బోణీ కూడా తెరవలేదు. ఎప్పుడూ లేనంత విధంగా పోస్టుల బ్యాలెట్ ఓట్లలో 1926 లెక్కించగా అందులో 40 శాతం ఓట్లు చెల్లలేదని కౌంటింగ్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వేసిన వారిలో ఎక్కువ మంది విద్యావంతులు అయి ఉండవచ్చు.

అయినప్పటికీ వారికి ఓటు ఎలా వేయాలో తెలియనంత అజ్ఞానులు అనుకోవడానికి వీలు లేదు. వీరు ఆలోచించిన ప్రకారం మన ఓటు వల్ల ప్రయోజనం ఏముందిలే అనుకున్నారో, లేదా మన ఓటు వేయడం వలన ఎవరికీ ఉపయోగం ఉండకూడదు అనుకున్నారా తెలియట్లేదు. అయితే పోస్టల్ బ్యాలెట్లలో అయితే ఇబ్బంది లేదు. దీని ద్వారా అభ్యర్థి గెలుపుపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఒకవేళ ఇదే ధోరణి కనుక సాధారణ ఓట్లలో జరిగితే ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: