తెలంగాణ లో గ్రేటర్ ఎన్నికల పర్వం, ఆంధ్ర లో తిరుపతి, మూడు రాజధానుల అంశం మరుగులో దేశంలో ఏం జరుగుతుందో ఇక్కడి ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. దేశం నడిబొడ్డున రైతులు మోడీ కి వ్యతిరేకంగా పెద్ద పెద్ద నిరసనలు చేస్తున్నారు.. ఇటీవలే అయన ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు కు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డుకెక్కారు..వ్యవసాయాధారిత దేశమైన మన దేశంలో రైతుల ఓట్లే కీలకం.. వారు ఎవరికి ఓట్లు వేస్తే వారికే పట్టం.. అయితే ఇది అందరికి తెలిసిందే.. అయినా తరతరాలుగా రైతులకే అన్యాయం జరుగుతుంది.. భారీగా రైతుల ఆత్మహత్యలు జరిగేవి బహుశా మనదేశంలోనే కావచ్చు..

అయితే ప్రధాని నరేంద్ర మోడీ వ్యవసాయ బిల్లుతో దేశంలోని ప్రతి పల్లెలో రైతులనుంచి వ్యతిరేకత వస్తుంది.. దాంతో యూపీ, బిహార్‌, పంజాబ్, మ‌హారాష్ట్ర స‌హా అనేక రాష్ట్రాల నుంచి రైత‌న్న‌లు క‌దం తొక్క‌తున్నారు. కేంద్ర సర్కార్ వెంటనే రైతులకు నష్టం చేకూర్చే బిల్లులను వెనక్కి తీసుకోవాలని ధర్నాలు చేస్తున్నారు.స‌ద‌రు చ‌ట్టాల‌ను కేంద్ర స‌ర్కారు వెన‌క్కితీసుకునే వ‌ర‌కు త‌మ ఉద్య‌మం విర‌మించేదిలేద‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి.  ఈహే వీటిని వెనక్కి తీసుకునేందుకు సముఖంగా లేని కేంద్ర సర్కార్ వారితో చర్చలకు ప్రయత్నిస్తూ విఫలమవుతుంది.

నిజానికి స‌ద‌రు చ‌ట్టాల‌ను పార్ల‌మెంటులో ప్ర‌వేశ పెట్టినప్పుడే కేంద్ర మంత్రిగా ఉన్న పంజాబ్ నాయ‌కురాలు కౌర్ రాజీనామా చేశారు. అయినా దీనిపై ఏమాత్రం మోడీ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌లేదు. కొన్ని ఇతరపార్టీ ల మద్దతు తో బిల్లును ప్రవేశ పెట్టారు.ఇప్పటివరకు మంచి ప్రధానమంత్రి గా ఉన్న మోడీ ఈ చర్యతో విలన్ గా మారిపోయారు.  రైతుల‌తో పెట్టుకున్న ఏ కేంద్ర ప్ర‌భుత్వ‌మూ బ‌తికి బ‌ట్ట‌క‌ట్టింది లేదు. గ‌తంలో అనేక ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి.  కాంగ్రెస్ ను ఉల్లి రైతులు గద్దె దించేశారు.. దానికి సహకరించింది బీజేపీ పార్టీనే .. ఇవన్నీ తెలిసి కూడా బీజేపీ పార్టీ రైతులని ఎదుర్కోవడం అంటే కొరివి తో తలగోక్కున్నట్లే..

మరింత సమాచారం తెలుసుకోండి: