ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అనే విషయం తెలిసిందే ఈ క్రమంలోనే భారత ఆర్మీ ని రోజురోజుకు మరింత పటిష్టవంతంగా మార్చుకుంటూ దూసుకుపోతుంది. భారత ఆర్మీ ని మరింత పటిష్టవంతంగా మార్చేందుకు వివిధ దేశాలనుంచి ఎంతో అధునాతనమైన ఆయుధాలను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ప్రస్తుతం భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో కూడా  శర వేగంగా పని చేస్తూ ఉంది. అయితే ప్రస్తుతం డి ఆర్ డి ఓ సరికొత్త ఆయుధాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి మద్దతు అందడంతో పాటు నిధులు కూడా అందుతున్న నేపథ్యంలో...  డి ఆర్ డి ఓ శరవేగంగా వ్యూహాలు అమలు చేస్తుంది అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఇప్పటికే పలు రకాల అధునాతన టెక్నాలజీతో కూడిన మిసైల్స్  ని కనుగొన్న భారత రక్షణ పరిశోధన సంస్థ వాటిని  శరవేగంగా ప్రయోగాల నిర్వహించి విజయవంతం అయింది అన్న విషయం తెలిసిందే. ఇక అంతే కాకుండా ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ప్రస్తుతం ఎంతో అధునాతన ఆయుధాలను ఆవిష్కరిస్తుంది డి ఆర్ డి ఓ.  ఇటీవలే భారత్  ఏకంగా ఆయుధ విక్రయాలను ప్రారంభించింది. ఈ  నేపథ్యంలో డిఆర్టీవో తయారుచేసిన ఆయుధాలు ప్రపంచాన్ని సైతం ఆకర్షిస్తుంటాయి. ఎక్కడ సంక్షోభం ఏర్పడకుండా ఉండేందుకు డిఆర్డిఓ శరవేగంగా ప్రస్తుతం ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది.




 అదే సమయంలో రాబోయే రోజుల్లో వచ్చే సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటుంది భారత్. ప్రస్తుతం రష్యా నుంచి భారత్ ఎస్ 400 మిసైల్ ఆర్డర్ చేసింది అనే విషయం తెలిసిందే. సాధారణంగా రష్యా నుంచి ఆయుధాలను ఆర్డర్  చేసినప్పుడు అమెరికా ఆ దేశంపై ఆంక్షలు విధిస్తుంది. ఈ క్రమంలోనే జో బిడెన్  వచ్చిన తర్వాత ఈ ఆంక్షలు వచ్చే అవకాశం ఉంది ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారత రక్షణ పరిశోధన సంస్థ..  ఎస్ 400 కు ప్రత్యామ్నాయంగా భారత్ కూడా ఒక బాలిస్టిక్ రక్షణ వ్యవస్థను తయారు చేస్తుందని.. దీనికి 2021లో ప్రయోగాలు జరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: