రాష్ట్రంలో పరిస్థితులు వైసీపీ పార్టీ కి ఏమంత అనుకూలంగా లేవు.. ప్రతిపక్షాలు జగన్ ని టార్గెట్ చేసి విపరీతమైన విమర్శలు చేస్తున్నాయి. ఓ వైపు టీడీపీ మరోవైపు జనసేన , బీజేపీ పార్టీ లు పోటా పోటీ గా జగన్ ను విమర్శించి అధికారంలోకి రావాలని చూస్తున్నాయి. చంద్రబాబు పర్సనల్ ఎటాక్ చేస్తుంటే, బీజేపీ మాత్రం రాష్ట్రంలో జరిగే కొన్ని పరిణామాలను ఆసరాగా చేసుకుని అందులో లూప్ హోల్స్ ని వెతికి మరీ జగన్ ను, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఇప్పటికే రామతీర్థం ఘటన పై చేయాల్సిన హంగమని ప్రతిపక్షాలు చేసేశాయి.. ఇందులో జగన్ ని పూర్తిగా విలన్ గా చూపించడానికి ప్రయత్నిస్తున్నాయి..

ఇలాంటి సమయంలో వైసీపీ తరపున జగన్ కాకుండా కొంతమంది నాయకులు గళం విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  ముఖ్యంగా జగన్ మంత్రి వర్గం ఇప్పుడు ప్రతిదాడి చేయాల్సిన అవసరం చాల ఉంది.. జగన్ పాతిక మంది నాయకులకు మంత్రి పదవులు ఇచ్చారు.. వీరు ఇప్పుడు తమ నోటికి పని చెప్పాలి లేదంటే జగన్ ని విమర్శిస్తూ ప్రతిపక్షాలు బలపడే ఆస్కారం ఉంది. ఓ నాలుగైదుగురు తప్పా వైసీపీ తరపున పెద్ద గా మంత్రులు నోరెత్తలేదు.. కానీ ఇప్పడు సగానికి పైగా మంత్రులు నోరు విప్పి జగన్ పై చేసే దాడిని తిప్పి కొట్టాలి..

మొదటినుంచి అంతా జగన్ చూసుకుంటారు అని భావించిన మంత్రులు ఇప్పుడు వారు కూడా స్పందించాల్సిన సమయం వచ్చిందని వైసీపీ క్యాడర్ భావిస్తుంది. మ జిల్లాలో రచ్చ జరుగుతున్నా కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పుష్ప శ్రీవాణి మౌనమే నా భాష అంటున్నారు. అలాగే బొత్స సత్యనారాయణ వంటి వారు కూడా పూర్తిగా చొరవ తీసుకోలేకపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మంత్రి సీదరి అప్పలరాజు అయితే ఉలుకూ పలుకూ లేదు. మంత్రి అవంతి శ్రీనివాస్ వంటి ఒకరిద్దరు మాత్రమే జరుగుతున్న వాటి మీద ఎప్పటికపుడు స్పందిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రులు మేల్కొని తమపై విమర్శలు చేసే వారిపై ప్రతి దాడి చేయాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: