టర్కీ సమద్ర తీరంలో బోర్లా పడి ఉన్న మూడేళ్ల బాలుడు అయలన్ కుర్ది మృత దేహం ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది హృదయాలను కదిలించింది. సిరియా తదితర దేశాలలో కాల్పుల మోతల మధ్య బతక లేక సముద్ర జలాల మీదుగా లక్షలాది కుటుంబాలు యూరఫ్ కు వలసపోతున్నారు. ఇలా వలస పోతూ సముద్రంలో మునిగి మరణిస్తున్న వేలాది మందిలో అమాయక పసిబాలుడు అయలన్ కుర్ది ఒకడు. ఆ బాలుడికి అరబ్బు గడ్డ మీది చమురు రాజకీయాలు తెలియవు. కోట్లాది జీవితాలను అతలాకుతలం చేస్తున్న అంతర్జాతీయ కుట్రలు తెలియవు. ఆ లేత హృదయానికి సంపన్ యూరఫ్ నగరాలు చేరాలన్న స్వప్నాలు కూడా లేవు. సముద్రపు అలలు అతడి వీపును నిమురుతుంటే గాఢనిద్రలో ఉన్నట్టుగా పడి ఉన్న ఆ బాలుడీ మృతదేహం ఫోటో సోషన్ మీడియా లక్షలాది మంది హృదయాలను ద్రవింప చేసింది. ఈ దృశ్యం ఎంత ఒత్తిడి తీసుకువచ్చిదంటే.. జీ20 సమావేశంలో ఉన్న టర్కీ నేత ఎర్డోగాన్ వలసన పై తక్షణం ప్రపంచ దేశాలు చర్చించాలని ప్రకటన చేయాల్సి వచ్చింది. యూరఫ్ దేశాల నాయకులు కూడా వెంటనే స్పందిచక తప్పలేదు.
దేశాలలో సాయుధ ఘర్షణల పర్వం కోనసాగుతుండటంతో

ఇప్పటికీ అప్ఘానిస్థాన్, ఇరాక్, సిరియా, లిబియా తదితర దేశాలలో సాయుధ ఘర్షణల పర్వం కోనసాగుతుండటంతో అక్కడి సమాజం చింద్రమైయ్యాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడవలసని ఘోర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల నుంచి బయట పడటానికి బయటి దేశాలకు పడవ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కొందరు మరింత భయానక స్థితిలో లిబియా నుంచి మధ్యధరా సముద్రం మీదుగా ఇటలీ చేరుకుంటున్నారు. వీరి దైన్నాన్ని కాసులుగా మార్చుకోవడానికి సముద్రాలు దాటించే దళారులు తయారయ్యారు. నాటు పడవల్లో మోతాదుకు మించి అనేక మందిని కుక్కి రాత్రికి రాత్రి దేశాలు దాటిస్తుంటారు. అయలన్ కుర్ది తండ్రి సైతం ఈ విధంగా భార్య, ఇద్దరు పిల్లలతో సముద్రం పై ప్రయాణిస్తున్నప్పుడు పుట్టి మునిగింది. తండ్రి బతికి బయట పడ్డాడు కానీ అలయన్ కుర్ది, ఆయన తల్లి, సోదరుడు నీటిలో మునిగి మరణించారు.
యూరప్ దేశాలకు శరణార్ధుల వలసలు పర్వం కోనసాగుతూనే ఉంది. ప్రమాదకర మార్గాల్లో ప్రయాణిస్తూ రోజు వందల మంది ప్రాణాలు కోల్పోతున్నా ఇంకా వేలల్లో తరలివస్తూనే ఉన్నారు. వారందరికీ ఆశ్రయం కల్పించలేక యూరోపియన్ యూనియన్ దేశాలు సతమత మవుతున్నాయి. జర్మనీ వెళ్లేందుకు హంగెరీ రాజధాని బుడాపెస్ట్ కు తండోపతండాలుగా చేరిన శరణార్థులను అడ్డుకొనేందుకు ఆ దేశం శుక్రవారం కూడా జర్మనీ వెళ్లే రైళ్లను నిలిపేసింది. మరో వైపు మధ్యధరా సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయిన సిరయా చిన్నారి అయిలన్ కుర్దీ ఫోటో ప్రపంచాన్ని కదిలిస్తున్నది. శరణార్థుల హృదయ విదారక పరిస్థితికి అద్ధం పడుతుంది. ఈ ఘటన తో శరణార్థులకు ఆశ్రయం కల్పించే విషయంలో ఈయూ దేశాల వైఖరి లో మార్పు వస్తోంది. తాము మరింత మంది శరణార్థులకు ఆశ్రయమిస్తామని బ్రిటన్ ప్రధాని డెవిడ్ కామెరాన్ ప్రకటించారు.
ఐక్య రాజ్య సమతి కూడా శరణార్ధులపై తీవ్ర

ఐక్య రాజ్య సమతి కూడా శరణార్ధులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సమస్య పరిష్కారానికి యూరప్ దేశాలు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించింది. అప్ఘాన్, లిబియా, ఇరాక్ దేశాలలో ప్రభుత్వాలను కూల్చి సంక్షోభం సృష్టించడంలో, సిరియా, తదితర దేశాలలో సంఘర్షణలను రాజేయడంలో అమెరికా తో పాటు యూరప్ దేశాలకు భాగస్వామ్యం ఉంది. ఈ వాస్తవాన్ని విస్మరించి శరణార్ధులను తట్టుకోలేక పోతున్నామంటూ కొన్ని దేశాలు అవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరికొన్ని దేశాల చౌక కూలీల కోసం శరణార్ధులను ఆదుకోవడం మానవతా ధర్మం అంటూ నీతి సూత్రాలు వల్లిస్తున్నాయి. ప్రపంచ యుద్ధాలను మించిన మారణహోమాన్ని అన్నిదేశాలు చూడనట్టుగా వ్యవహారిస్తున్నాయి. లక్షలాది కుటుంబాలు వలస వస్తుండటంతో తీర ప్రాంతంలోని గ్రీసు, ఇటలీ వంటి దేశాలు ఈ ఒత్తిడిని భరించలేమంటున్నాయి. యూకే గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 216 మంది సిరియన్లను మాత్రమే అనుమతించింది.
యూరప్ లోని కొన్ని దేశాలు శరణార్ధుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని, విశ్వజనీన మానవ హక్కులతో యూరప్ కున్న అనుబంధాన్ని తెంచుకోకూడదని జర్మనీ ఛాన్సలర్ ఏంజియా మెర్కెల్ అంటున్నారు. జర్మనీ పత్రికలు కూడా శరణార్ధులకు అనుకూలంగా రాస్తూ ప్రజాభిప్రాయాన్ని కూడగడుతున్నాయి. ఈ వలసలపై అవగాహనకు రావడానికి ఈ నెల పదహారవ తేదీన యూరప్ దేశల నాయకులు సమావేశం అవుతున్నారు. శరణార్థుల సమస్య గురించి ఇంతగా మాట్లాడుతున్న యూరోపియన్ దేశాల నాయకులు, అక్కడి పత్రికలు ఈ వలసల మూల కారణాల గురించి మాత్రం చర్చించడంలేదు. ఆఫ్ఘానిస్ధాన్ , ఇరాక్,లిబియా దేశాలలో ప్రభుత్వాలను కూల్చి సంక్షోభం సృష్టించడంలో సిరియా తదితర దేశాలలో సంఘర్షణలను రాజేయడంలో అమెరికాతో పాటు యూరప్ దేశాలకూ భాగస్వామ్యం ఉంది.
వాస్తవాన్ని విస్మరించి శరణార్థులను తట్టుకోలేక పోతున్నామంటూ కొన్ని దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ యుద్దాలను మించిన మారణహోమాన్ని అన్ని దేశాలూ చూడనట్టు వ్యవహరిస్తున్నాయి. ఆసియా, ఆప్రికా, యూరప్ ఖండాల దాపున ఇసుకలో బోర్లా పడి ఉన్న అయలన్ కుర్ధి మృత దేహాన్ని చూసి ప్రపంచదేశంలోని లక్షలాది ప్రముఖులు, ప్రజలు కన్నీరు పెట్టారు. నా చావుతోనైనా నాదేశానికి విముక్తి కలుగుతుందని చాటి చెప్పి, సముద్ర అలల మద్య శాశ్వత నిద్రలోకి పోయినా ఆ చిన్నారిని చూసైనా ప్రపంచ దేశాల్లో మార్పువస్తుందని ఆశిద్దాం..!