ఈ ఘోస్ట్ కిచెన్ పద్ధతి అంటే వంటగది కనిపించదు అంటే లేదని కాదు.. కిచెన్ ముఖం చూడకుండానే ఆహారం పొందడం అన్నమాట అంటే.. ఆన్ లైన్ ఆర్డర్లు ఇచ్చుకోవడం.. అవును కరోనా తర్వాత ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రంగం బాగా ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఒకవేళ బయటకు వెళ్లినా.. రెస్టారెంట్లకు వెళ్లినా.. ఎక్కడా డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఘోస్ట్ కిచెన్ సంస్కృతి ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో బాగా విస్తరిస్తోందట.
ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ దేశాలతో పాటు మరికొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ జోరందుకుంటోంది కదా. అందుకే ఈ జాగ్రత్తలన్నీ.. కేసులు ఎక్కువగా వ్యాపిస్తున్న బ్రిటన్‌లోనూ ఇదే ట్రెండ్ నడుస్తోందట. అక్కడే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే సంస్కృతి అభిలషణీయంగా కనిపిస్తోంది. అసలే కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా ఇలాంటి కొత్త సంస్కృతులు ఊపిరిపోసుకోక తప్పదు. అంతే కదా. అవసరం అన్నీ నేర్పిస్తుంది అంటే ఇది.
ఇప్పుడు ఇండియాలోనూ ఇదే సంస్కృతి విస్తరించాల్సి ఉంది. ఎందుకంటే.. మహారాష్ట్రలో రోజురోజుకీ రికార్డు స్థాయిలో మరోసారి కేసులు నమోదవుతున్నాయి. దేశంలో మరోసారి కరోనా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో కేసులు పెరుగుతండటంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా రహిత దేశంగా మారేందుకు ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేలా అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. ఏదేమైనా ఇంకా మన జీవితాల్లోనుంచి కరోనా వెళ్లిపోలేదు. ఆ స్పృహ అందరిలోనూ అవసరం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి