కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ఏపీ మొత్తం చిగురుటాకుల వణికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ కేసులు సంఖ్యను తగ్గించేందుకు ఎన్ని రకాల ఆంక్షలను అమల్లోకి తెచ్చినప్పటికీ ఎక్కడ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు కదా రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని కట్టడి చేయడం అటు ప్రభుత్వానికి పెద్ద సవాలుగానే మారిపోయింది అని చెప్పాలి.  కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నో దారుణ  ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా వైరస్ వచ్చిన తర్వాత తన సొంత వాళ్ళు కూడా దగ్గరికి రాని పరిస్థితి ఏర్పడుతుంది.



 సొంత వాళ్ళు రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు పరాయివాళ్ళ లాగా దూరంగా ఉంటే చివరికి పరాయివాళ్లే ముందుకు వచ్చి మానవత్వంతో సహాయం చేస్తున్న ఘటనలు కూడా అందర్నీ కలచివేస్తున్నాయి. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో. ఇటీవలే ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. అయితే అతనిని ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు కుటుంబీకులు మాత్రం ఎవరూ ముందుకు రాలేదు.  అందరూ భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి సమయంలో అటు పంచాయతీ కార్యదర్శి దేవుడిలా ముందుకొచ్చాడు.



 ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస పంచాయితీలో చోటుచేసుకుంది. ఇక ఆ పంచాయతీ కార్యదర్శి ధైర్యంగా ముందుకు వచ్చిన తీరు అందరిచేత ప్రశంసలు అందుకునేలా చేస్తుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవలే కరోనా వైరస్ సోకగా.. ఇక సదరు వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబసభ్యులు భయపడిపోయారు ఎవరూ ముందుకు రాలేదు ఇలాంటి సమయంలో పంచాయతీ కార్యదర్శి ముందుకు వచ్చి పి పిఈ  కిట్ ధరించి ఇక తన ద్విచక్రవాహనంపై కరోనా రోగిని ఆస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: