
ఇది భారత దేశానికీ, పాశ్చాత్య దేశాలకు మధ్య యుద్ధం కాదు. ఇది అలోపతి కీ ఇతరులకూ పోటీ కాదు. ఇది మనమందరం ఒక వైపూ, వైరస్ ఇంకొక వైపూ ఉండాల్సిన యుద్ధం. యుద్ధం అయ్యాక మోసం చేస్తున్న హాస్పిటల్స్ పని పట్టండి. ఇప్పుడు మాత్రం ప్రాణమే ముఖ్యం అని మర్చిపోవాకండి. డాక్టర్ మీద దాడి ఆపండి. వారు లేకపోతే మనలో చాలా మంది ఉండరు. చాలా మంది తప్పులు చేస్తుండవచ్చు - వైద్యం ప్రైవేట్ రంగానికి అప్పచెప్పినప్పుడు ఇలాగే ఉంటుంది. కృష్ణపట్నం లో కేసులు లేవు అన్న అబద్ధం నుండి పుట్టుకొచ్చిన ఉన్మాదం ఇది. తను చేసిన వంటకాన్ని మందు అని ఆనందయ్య అనడం వల్ల వచ్చిన అభిప్రాయం ఇది.
నాకు బాగైంది అని కొంతమంది సాక్ష్యం చెప్పడం వల్ల ఏర్పడిన ప్రేయర్ ఆయిల్ విశ్వాసం ఇది. వైరస్ సోకిన తరువాత 14 రోజులకు సాధారణంగా నెగటివ్ వస్తుంది. ఎందుకంటే వైరస్ జీవిత కాలం అది. జలుబు లాగానే. 12 వ రోజు నెల్లూరు కి వచ్చి చట్నీ తిని రెండు రోజుల్లో నెగటివ్ అంటే అది దేనికీ రుజువు కాదు. యుర్వేదం తనకు కరోనా లాంటి వైరస్ ను కట్టడి చేసే శక్తి ఉన్నదని ఎక్కడా నిరూపించలేదు. మూలికా వైద్యం కూడా కరోనా పై తన ప్రతాపం నిరూపించలేదు. ఆనందయ్య చేస్తున్నది ఆయుర్వేదము కాదు. ఆ విషయం ఆయుష్ కూడా చెప్పింది. నేను మతస్తులకు వ్యతిరేకం కాదు. ఉన్మాదులకు మాత్రమే." అంటూ సంచలన వ్యాక్యలు చేశారు.