ఇలా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ భారీగా డబ్బులు అందించేందుకు వేల కోట్ల నిధులను కేటాయిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల ద్వారా భారీగా నిధులు అందిస్తూ ఉండడంతో ఇక రోజురోజుకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిపోతుంది. ఏపీ అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు కొత్త అప్పులు తీసుకురావడానికి అటు ఏపీ ప్రభుత్వం గత కొన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తోంది. అయితే ప్రభుత్వం ఉచిత పథకాలు నేరుగా వద్దని చెబితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇక ప్రభుత్వం ఉచిత పథకాలు ఇవ్వడానికి కూడా వీళ్ళేని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి తీసుకురావాలని ప్రస్తుతం చంద్రబాబు రఘురామకృష్ణంరాజు వ్యూహాలను అమలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వానికి అప్పులు ఇవ్వవద్దు అంటూ కేంద్రానికి లేఖల మీద లేఖలు రాస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన నేతలు రాసిన లేఖలపై ప్రభుత్వాన్ని సమాధానం కోరుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇలా ఓ వైపు చంద్రబాబు మరో వైపు నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యూహల వల్ల రానున్న రోజుల్లో జగన్ పథకాలకు బ్రేక్ పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అటు చంద్రబాబు ఇటు రఘురామకృష్ణంరాజు లక్ష్యాలు నెరవేరుతున్నట్లే కనిపిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి