
సైదాబాద్, సింగరేణి కాలనీలో జరిగిన చిన్నారి చైత్య అత్యాచారం, అటుపై హత్యోదంతంకు సంబంధించి నిందితుడు రాజు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ సమీపాన నిందితుడి మృతదేహం రైల్వే ట్రాక్ పై పడి ఉంది. ఆయన చేతిపై ఉన్న టాటూ ఆధారంగా రాజు ను గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. పాత నేరస్తుడిగా పేరున్న రాజు మొన్నటి వినా యక చవితి ముందు రోజున చిన్నారి చైత్ర ఆడుకుంటున్న సమ యంలో నిందితుడు రాజు తన ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. త రువాత హత్య చేసి పారిపోయాడు.
చైత్ర కోసం కాలనీ అంతా తిరిగిన తల్లిదండ్రులు రాజుపై అనుమానం వచ్చి ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టారు. దీంతో అసలు వి షయం వెలుగు చూసింది. ఘటన జరిగిన వెంటనే రాజు పారిపోయాడు. తరువాత తన స్నేహితు డితో మద్యం సేవించాడు. ఆ తరువాత సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఉప్పల్ ప్రాంతంలో తిరుగాడుతున్నట్లు సమాచారం అందుకు న్న పోలీసులు. దీంతో సీసీ టీవీ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని అన్ని ప్రాంతాలలో పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఈ తరుణంలో అతడు రాష్ట్రం దాటిపోయేందుకు అవకాశాలున్నాయని వార్తలు వచ్చినా అవేవీ నిజం కాదని తాజా ఘటనతో నిరూపణ అయింది. ముఖ్యంగా పోలీసులు తనను ఎన్కౌంటర్ చేస్తారన్న అనుమానంతోనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. తనపై పది లక్షల రూపాయల రివార్డు ప్రకటించారన్న విషయం తెలిసినా కూడా ముఖ్యంగా పౌర సమాజం నుంచి వచ్చిన ఆగ్రహావేశాల కారణంగానే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు అన్నది సుస్పష్టం.