టీ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైనప్పటినుండి తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ నెలకొంది. వర్షకాల సమావేశాలు, భేటీలతో కాంగ్రెస్ శ్రేణులు ఇతర పార్టీలలో గుబులు లేపుతున్నారు. కాంగ్రెస్ బలోపేతానికి పావులు కదుపుతున్నారు. అంతేకాకుండా బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దళిత, గిరిజన దండోరా ఆత్మగౌరవ సభలతో తెరాసపై  దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రేవంత్ అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఓ వ్యూహం సిద్ధం చేశారు. ఖమ్మం,నల్గొండ, రంగారెడ్డి , మహబూబ్ నగర్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధి పైనే రేవంత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ జిల్లాలో అసెంబ్లీ సీట్లలో అత్యధికంగా కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని రేవంత్ అంచనా వేస్తున్నారు.

 ఈ జిల్లాలోనే పార్టీకి కనీసం 50కి పైగా సీట్లు వస్తాయని  రేవంత్ బలంగా నమ్ముతున్నారని సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అందులో భాగంగా మహేశ్వరం పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. సబితా ఇంద్రారెడ్డి 2009 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి బరిలో దిగి విజయం సాధించారు. ఆ తర్వాత వైయస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రివర్గంలో పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు కానీ ఆమె తనయుడు కార్తిక్ రెడ్డి చేవెళ్ల ఎంపీ  గా పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికలు వచ్చేసరికి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మహేశ్వరం లో మళ్లీ గెలిచారు. కానీ ఆ వెంటనే ఆమె  టిఆర్ఎస్ లోకి వెళ్లారు. ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పని చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్ లోకి వెళ్లి మంత్రి పదవి చేపట్టడం పై కాంగ్రెస్ శ్రేణులు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో సబితకు మహేశ్వరం లో కాస్త వ్యతిరేకత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ సీటు కోసం టిఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి కాచుకొని కూర్చున్నారు.

 సబితను టిఆర్ఎస్ లోకి తీసుకువచ్చిన దగ్గర్నుంచి తీగల సైలెంట్ అయ్యారు. ఆ మధ్య ఈయనను  రేవంత్ కలిశారు. దీంతో తీగల కాంగ్రెస్  కు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఆయన టిఆర్ఎస్ లోనే  ఉన్నారు. కానీ వచ్చే ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలు మారితే తీగల పరిస్థితిని బట్టి మారిపోయే అవకాశం ఉంది. మహేశ్వరంలో తీగలకు సొంత బలం ఎక్కువే. అటు చూస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ఇంఛార్జిగా భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఈయన దూకుడు గానే పనిచేస్తున్నారు. అలాగే బిజెపి తరఫున శ్రీరామ్ యాదవ్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజెపి కి కాస్త ఓటు బ్యాంకు ఉంది. కాకపోతే టిఆర్ఎస్,కాంగ్రెస్ ల మద్యే గట్టి పోటీ ఉంటుంది. కవిత ను ఓడించేల బలమైన నేతనే బరిలో దించేలా రేవంత్ వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: