హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న విమర్శలు హాట్ టాపిక్ అయ్యాయి. సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ప్రజలను ద్దేశించి మాట్లాడిన బండి సంజయ్ కీలక కామెంట్స్ చేసారు. కిసాన్ మోర్చ జాతీయ అధ్యక్షుడు రాజ్ కుమార్ చాహర్, ఆదిలాబాద్ ఎంపీ సొయం బాపురావు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. వరి వేస్తే ఉరి అని చెబుతున్న కేసీఆర్ కు వరి కొనమని ఎవరు చెప్పారు ? అని నిలదీశారు. పండించిన ప్రతి గింజ కొంటమన్న కేసీఆర్.. ఇప్పుడు నేపాన్ని కేంద్రం పై నెడుతున్నాడు అని ఆయన ప్రశ్నించారు.

రైతులను భయపెడుతున్న కేసీఆర్ అంటూ ఆయన ఆరోపణలు చేసారు. రైతులకు, బియ్యానికి ఎం సంబంధం.. రైతులు అమ్మేది వడ్లు అని అన్నారు.  భాషకు గురువు కేసీఆరే.. కేసీఆర్ ను గద్దె దించేదాక భాష మార్చుకోనని ఆయన స్పష్టం చేసారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నది కేంద్రం అన్నారు ఆయన. రైతులు ఎవరూ భయపడొద్దు.. పండించిన ప్రతి గింజను కేసీఆర్ చేత కొనిపిస్తాం అని కేంద్రంతో కొనిచ్చే భాద్యత నాది అన్నారు ఆయన. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు అమ్మేది కేసీఆర్ సన్నిహితులే అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

కేసీఆర్ ఒక్క రైతు బంధు ఇచ్చి మిగితావన్ని బంద్ చేసిండు అని మండిపడ్డారు. తోటపల్లి రిజర్వాయర్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. రాష్త్రంలో ఇల్లు లేని పేదవాడు ఉండొద్దు రా మోడీ వద్దకు వెళ్దాం.. అంటే ఫామ్ హౌస్ కదలడు అన్నారు. నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వని కేసీఆర్ తన కుటుంబంలో నలుగురికి ఇచ్చుకున్నడు అని మండిపడ్డారు. నిరుద్యోగ భృతికి దిక్కులేదు.. ఉద్యోగుల కు జీతాలు లేవని ఆరోపణలు చేసారు. ఉద్యోగాలు ఇవ్వుమంటే ఉడగోడుతున్నాడు  అని మండిపడ్డారు. ఆనాడు ఉద్యమం కోసం ఆత్మహత్యలు చేసుకుంటే.. ఈ రోజు ఉద్యోగాలు రాక ఆత్మహత్య లు చేసుకుంటున్నరు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp