ఇటీవల ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ... మాట్లాడిన మాజీ ఎంపీ ఉండవల్లికి పవన్ తాజాగా ఫోన్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. ఇప్పటికే ఉండవల్లిని తరచుగా పేర్కొనే.. పవన్.. గతంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో తాను వేసిన అధ్యయన కమిటీలోను, తర్వాత నిర్వహించిన సదస్సులోనూ.. ఉండవల్లికి పవన్ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక, ఇప్పుడు.. ఉండవల్లి.. జగన్‌పై చేసిన ఆర్థిక ఆరోపణలను కూడా పవన్ ప్రత్యక్షంగానే సమర్ధించారు. ``ఉండవల్లి చెప్పినట్టు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది`` అని పవన్ ట్వీట్ చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఉండవల్లి రాజకీయంగా మళ్లీ పుంజుకుంటారా? వచ్చినా.. పవన్ పార్టీలోకి వస్తారా? అనేది తేలాల్సి ఉంది. అయితే.. రాజకీయంగావిమర్శలు చేసే ఉండవల్లి.. ఇప్పటి వరకు పవ న్‌పై ఎలాంటి విమర్శలు చేయకపోగా.. పవన్ ఐడియాలను తరచుగా ప్రశంసిస్తూ.. ఉంటారు. అదేసమ యంలో పవన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో పుంజుకుని.. అధికారం చేపట్టే దిశగా కూడా దూసుకుపోవాలని ఆయన తరచుగా చెబుతుంటారు.
ఈ క్రమంలో ఉండవల్లి.. జనసేన లోకి వచ్చే అవకాశం ఉందని.. అంటున్నారు పరిశీలకులు. అయితే.. మరికొందరు మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు ఉండవల్లి ఎప్పుడో గుడ్ బై చెప్పేశారని.. సో.. కష్టమేనని అంటున్నారు. ఏదేమైనా. ఇప్పుడు పవన్ ఫోన్‌తో ఉండవల్లి రాజకీయ వ్యవహారం మరోసారి ఆసక్తిగా మారింది. ఏం జరుగుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి