ఏంటి ? ప్రశాంత్ అంత మాట అనేశాడా ?  

ఉత్తర ప్రదేశ్ తో పాటు మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలలో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ.  ఆ దిశగా అడుగులు వేస్తూ  మరింత దూకుడుగా ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లఖింపుర్ ఘటన కలిసి వచ్చింది. ఆ సంఘటనను క్యాష్ చేసుకోవడానికి అన్ని పద్దతులూ అవలంబించింది. రాష్ట్రపతిని సైతం కాంగ్రెస్ బృందం కలిసింది. న్యాయం చేయాలంటూ విజ్ఞాపన పత్రం అందించింది.  హమ్మయ్యా అనుకునే సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. సామాజిక మాధ్యమాలలో కాంగ్రెస్ తీరును ఎండకట్టారు. లఖింపూర్ పరిసర ప్రాంతాలలో ఎన్నో సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించకుండా , ఆ దశగా ఆలోచనలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలు చేస్తోంది అంటూ విమర్శించారు. ఇది పెద్ద దుమారాన్నే లేపింది. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి ప్రశాంత్ కిశోర్ , వ్యూహ రచన చేస్తారు, సారధ్యం వహిస్తారు అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన విమర్శలు  కాంగ్రెస్ లో కలకలం  సృష్టించాయి.
ప్రశాంత్ కిశోర్ తాగాగా మరోసారి  దుమారం రేపారు. ఈ దఫా ఆయన కాంగ్రెస్ యువ నాయకత్వం పైనే విమర్శలు చేశారు. అదీ సునిశితంగా.  ఈ దఫా ఆయన  రాహుల్ గాంధీ, ప్రియాంక వద్రాల పై విమర్శలు చేశారు. సోదరి , సోదరుల మధ్య విభేధాలున్నాయని పరోక్షంగా  పేర్కోన్నారు. ఈ వారంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కేద్ర నిర్దాయక మండలి (సి.డబ్ల్యూ.సి) సమావేశం తరువాత ప్రశాంత్ కిశోర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మరో ఏడాది పాటు కాంగ్రెస్ పార్టీ అధినేతగా సోనియా గాంధీనే ఉంటారని ఆ పార్టీ ప్రకటించింది. ఆ తరువాతనే  నూతన అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది.   తాజాగా ఎన్నికల వ్యూహకర్త  కాంగ్రెస్ అధినేత్రి సంతానం లో బేధాభిప్రాయాలున్నాయని ప్రకటించారు.  ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బాధ్యతలు చూస్తున్న ప్రియాంక వద్రా అంటే  రాహుల్ గాంధీకి గిట్టదని తెలిపారు. ఆమె అంటే రాహుల్ కు భయమని స్పష్టంగా చెప్పారు. అంతే కాదు తాను చెప్పిన మాటలకు ఆయన కొన్ని ఉదాహరణలు పేర్కోన్నారు.  ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో 2017 న కాంగ్రెస్ పార్టీ ఓటమికి సోదరి సోదరుల మధ్య ఉన్న విబేధాలే కారణమని పరోక్షంగా పేర్కోన్నారు. ఆ ఎన్నికల్లో ప్రియాంక వద్రాను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించ లేదని తెలిపారు.  నాడు కాంగ్రెస్ పార్టీ ఓటమికి అదోక కారణని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ప్రియాంక వద్రా  దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని పోలి ఉంటారని,  నానమ్మ లక్షణాలు వద్రాకు వచ్చాయని  ప్రశాంత్ కిశోర్ పేర్కోన్నారు.  తాజాగా ఎన్నికల విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలు  రాజకీయ వర్గాలలో పెద్ద దూమారాన్నే రేపాయి. అయితే కాంగ్రెస్ శ్రేణులు ఈ వ్యవహారాన్ని ఆచి చూచి  వ్యవహరిస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలను సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎవరూ ఖండించ లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: