తాలిబ‌న్‌లు అంటే న‌ర‌రూప రాక్ష‌సులు అని ప్ర‌పంచం అంతా న‌మ్ముతుంది. ఇటీవ‌ల అఫ్ఘ‌నిస్తాన్ పాల‌న ప‌గ్గాలు చేప‌ట్టిన త‌రువాత మేము మారిపోయాం.. మంచి పాల‌నను అందిస్తామ‌ని ప్ర‌పంచాన్ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ వాళ్ల రాక్ష‌స‌త్వానికి అంతులేద‌నే సంఘ‌ట‌న‌లు అనేకం వెలుగులోకి వ‌చ్చాయి. ఆడ‌పిల్ల‌ల చ‌దువుల ద‌గ్గ‌ర నుంచి మ‌హిళ‌ల ఉద్యోగాల వ‌రకూ అన్నీ క‌ఠిన ఆంక్షాలు పెట్టారు. తాజాగా తాలిబ‌న్‌ల మ‌రో కృర‌త్వం వెలుగులోకి వ‌చ్చింది. ఆల‌స్యంగా బ‌య‌ట‌ప‌డిన ఈ ఉదంతం అంద‌రినీ క‌లిచివేస్తోంది.


  అఫ్గ‌నిస్తాన్‌లో ఆగ‌స్టు 15న ఓ మ‌హిళా క్రీడాకార‌ణిని పొట్ట‌న పెట్టుకున్నారనే స‌మాచారం సోష‌ల్ మీడియా ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చింది. చంప‌బ‌డిన ఈ క్రీడాకారిణి పేరు మొహ‌జ‌మీన్ హ‌కీమీ అని చెబుతున్నారు. ఈ హత్య‌కు సంబంధించి అఫ్గ‌న్ మీడియా సోష‌ల్ మీడియాలో స‌మాచారం ఇచ్చారు. హ‌కీమీ హత్య‌కు ఒక కార‌ణం ఆమె మైనారిటీ హ‌జ‌రా వ‌ర్గ‌నికి చెందిన వారు కావొచ్చ‌ని వాళ్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తాలిబ‌న్‌లు ఈ మైనారిటీ స‌మూహాన్ని ద్వేషిస్తారు పైగా మ‌హిళ‌లు క్రీడల్లో పాల్గొన‌డాన్ని ఇది వ‌ర‌కే నిషేధించారు. ఈ సంఘ‌ట‌న గురించి వాలీబాల్ క్రికెట్ జ‌ట్టుకోచ్ సోష‌ల్ మీడియాలో స‌మాచారం ఇచ్చారు. ఈ సంఘ‌ట‌న కొన్ని రోజుల పాత‌ది అయితే ప్ర‌పంచం ఈ విష‌యం గురించి ఇప్పుడే తెలుసుకుంది. మెహ‌జ‌పీన్ హ‌త్య గురించి ఆమె కుటుంబ స‌భ్యుల‌కు ఎవ‌రికీ స‌మాచారం ఇవ్వ‌లేదు. ఎందుకంటే ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టొద్ద‌ని ఆ కోచ్‌ను బెదిరించారు. మీడియా ఇచ్చిన నివేదికలు, ఇత‌ర స‌మాచారం మేర‌కు మెహ‌జ‌పీన్ వాలీబాల్ క్రీడాకారిణి మాత్ర‌మే కాదు.. ఇత‌ర క్రీడీకార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

   అష్ర‌ఫ్ ఘ‌నీ ప్ర‌భుత్వ కాలంలో ఆమె త‌ర‌చుగా క్ల‌బ్‌కు వెళ్లేది ఆమె మ‌ర‌ణం త‌రువాత ఆ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.  గ‌త కొన్ని రోజుల క్రిత్రం అఫ్గ‌న్ మ‌హిళ క్రికెట్ టీం క్రీడ‌ల్లో పాల్గొన‌ద్ద‌ని ఆదేశాలు జారీ చేసింది తాలిబ‌న్ ప్ర‌భుత్వం. అఫ్గ‌న్ లో ఉన్న మ‌హిళా క్రీడాకారుల‌కు ఎప్ప‌టికైనా ముప్పుత‌ప్ప‌ద‌ని విశ్లేకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: