తెలంగాణ లోని హుజూరాబాద్ ఉప ఎన్నిక ల్లో అధికార టీఆర్ ఎస్ వ‌ర్సెస్ బీజేపీ మ‌ధ్య హోరా హోరీ పోరు సాగుతుంది. ఈ ఎన్నిక ల్లో విజయం సాధించేందుకు అధికార టీఆర్ఎస్ అన్ని ప్ర‌యోగాలు చేస్తోంది. ముందు నుంచి ఈ పార్టీకి ధీమా ఉన్నా కూడా నామినేష‌న్లు ముగిశాక టీఆర్ ఎస్‌లో భ‌యం అయితే మొద‌లు అయ్యింది. ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్టే విష‌యంలో మిగిలిన పార్టీల క‌న్నా టీఆర్ ఎస్ ఎవ్వ‌రికి అంద‌నం త ఎత్తులో అయితే ఉంద‌ని చెప్పాలి.

టీఆర్ ఎస్ వాళ్ల‌కు బంప‌ర్ మెజార్టీతో గెలుస్తామ‌న్న ధీమా అయితే ఉంది. ఇక్క‌డ కాంగ్రెస్ కూడా రేసు లో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే ఉంది. అయితే ఇప్పుడు గులాబీ పార్టీని ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు తెగ టెన్ష‌న్ పెట్టేస్తున్నారు. వాళ్ల‌లో కొంద‌రికి కేటాయించిన గుర్తులు కారుతో పోలి ఉండటం ఇబ్బందికరంగా మారింది.

ఎందుకంటే గ‌తంలోనే ఈ గుర్తుల తో టీఆర్ ఎస్ గెల‌వాల్సిన కొన్ని సీట్ల‌లో ఓడిపోయింది. గ‌త 2018 సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ కొన్ని చోట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయింది. అప్పుడు రోడ్డు రోల‌రు, చ‌పాతీ క‌ర్త గుర్తులే అక్క‌డ గులాబీ అభ్య‌ర్థుల ఓట‌మి కి కార‌ణ‌మ‌య్యాయి. ఇప్పుడు హుజూరా బాద్ లో సైతం ఆ ప‌రిస్థితి ఉంటుందా ? అన్న ఆందోళ‌న అధికార పార్టీని వెంటాడు తోంది.

ఉదాహ‌ర‌ణ‌కు 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను రోడ్డు రోలర్ గుర్తు ఓడించింది. ఆ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థికి 27 వేల ఓట్లు వచ్చాయి. అయితే న‌ర్స‌య్య గౌడ్ కేవ‌లం 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మ‌రి ఇప్పుడు ఇక్క‌డ ఆ గుర్తుల‌కు ఎక్క‌డ ఓట్లు ప‌డితే అది టీఆర్ ఎస్ కే ఎఫెక్ట్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR