జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు రాజ‌కీయంగా మ‌ళ్లీ యాక్టివ్ అవుతున్నారు. అయితే ప‌వ‌న్ ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో మిగిలిన వాళ్ల సంగ‌తి ఎలా ఉన్నా ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గం అయిన కాపులు అయినా న‌మ్ముతారా ? అన్న‌దే ఇప్పుడు పెద్ద స‌స్పెన్స్ గా మారింది. ప‌వ‌న్ ఇటీవ‌లే కాపులు అంద‌రూ ఏకం కావాల్సి ఉంద‌న్న అంశాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావి స్తూ వ‌స్తున్నారు. ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు కులాల విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించు కోలేదు. అయితే ఇప్పుడు ఆయ‌న నోటి వెంట ప్ర‌ధానంగా కాపు కులం గురించి ప్ర‌స్తావ‌న త‌ర‌చూ వ‌స్తోంది.

అయితే కాపులు అంద‌రూ ప‌వ‌న్ ను న‌మ్మేస్తారా ?  నిజంగా అంత సీన్ ఉందా ? అంటే నిజంగా అంత సీన్ లేద‌నే చెప్పాలి. అస‌లు కాపులు ఎక్కువుగా న‌ష్ట‌పోయింది మెగా ఫ్యామిలీ వళ్లే అని ఆ కులం వారే చెప్పే మాట‌. చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు ఎంతో మంది కాపు ధ‌న‌వంతులు , పారిశ్రామిక వేత్త‌లు , ఇత‌ర పార్టీల్లో స్ట్రాంగ్ గా మంచి ప‌ద‌వుల్లో ఉన్న కాపు నేత‌లు.. చివ‌ర‌కు కాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంద‌రూ చిరును న‌మ్మేసి ఈ పార్టీలోకి వ‌చ్చారు.

ఈ పార్టీలో కోట్లాది రూపాయ‌లు ఖర్చు పెట్టి ఆర్థికంగా కుదేలు అయిపోయారు. ఇక టిక్కెట్లు ఆశించి కోట్లు ఖ‌ర్చు పెట్టిన వారు పార్టీ టిక్కెట్లు చాలా మంది రాజకీయాలకు కూడా దూరమయ్యారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లోనూ చాలా మంది కాపు నేత‌లు జ‌న‌సే న నుంచి పోటీ చేశారు. వీరు కూడా ఆర్థికంగానే గ‌ట్టిగానే ఖ‌ర్చు పెట్టారు. మ‌ళ్లీ వారు ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టి ఎన్నిక‌ల‌లో పోటీ చేయాలి రా బాబు అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాన్ రాజ‌కీయ నిల‌క‌డ లేమి తో కూడా చాలా మంది కాపులు న‌మ్మే ప‌రిస్థితి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: