
అయితే రాష్ట్రపతి భవన్ లో ఇక ఇటీవల జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఒక సరదా సన్నివేశం ఎంతో మంది మనసు దోచేసింది. సాధారణంగా పద్మ అవార్డులను అందుకోవడానికి వెళ్లిన వ్యక్తులు రాష్ట్రపతికి ఎంతో గౌరవంగా నమస్కారం చేసి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డును స్వీకరిస్తు ఉంటారు. అయితే ఇటీవలే పద్మ అవార్డును దక్కించుకున్న ఒక ట్రాన్స్జెండర్ రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి తనదైన శైలిలో దిష్టి తీసింది. ఈ క్రమంలోనే ఇక ట్రాన్స్జెండర్ అలా చేయడం మాత్రం అక్కడున్న వారికి మనసు దోచేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే పద్మ అవార్డుల్లో భాగంగా దేశ చరిత్రలోనే మొదటిసారి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైంది ఒక ట్రాన్స్ జెండర్.
ఇటీవలే 2021 సంవత్సరానికి గాను మొత్తం 119 మంది కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులతో సత్కరించింది. అయితే ఇలా పద్మ అవార్డులను సొంతం చేసుకున్న వారిలో ఓ ట్రాన్స్ జెండర్ కూడా ఉండటం విశేషం. ట్రాన్స్ జెండర్ మాతా బి మంజమ్మ జోగతి పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు. డాన్సర్ ఫోక్ సింగర్ అయిన మంజమ్మ కర్ణాటక జానపద అకాడమీ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు. అయితే ఇటీవల రాష్ట్రపతి భవన్లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకునేందుకువెళ్లిన మంజమ్మ చీర కొంగుతో రాష్ట్రపతికి దిష్టితీసి ఇక తనదైన శైలిలో వ్యవహరించారు. ఈ క్రమంలోనే ట్రాన్స్ జెండర్ ఇలా చేయడం అందరి మనసులను దోచేసింది. దీంతో అక్కడి సభావేదిక మొత్తం చప్పట్లతో మారుమోగింది.