విదేశాల నుంచి భారత్ కు వచ్చిన ప్రయాణీకులు ఎవరు ? వారు ఎక్కడెక్కడ ఉన్నారు ? వారి గమనాగమనాలేంటి ? తదితర అంశాల పై ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది. ముఖ్యంగా గత పదిహేను రోజుల క్రితం నుంచి దేశంలోకి వచ్చిన ప్రయాణీకులన జాబితాను యుద్ధ ప్రాతిపదికన   అదికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ వివరాల సేకరణ అంతా గోప్యంగా జరుగుతుండటం విశేషం.  కేంద్ర ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు మందస్తుగా చర్యలు చేపట్టాయి. ఇందుకు ప్రత్యేకమైన కారణం ఉంది. ఈ రాష్ట్రాలలో అంతర్జాతీయ విమానాలున్నాయి. నిత్యం విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్నారు.
కోవిడ్-19, కేసులు పెరగడం తో పాటు,  వైరస్ యొక్క కొత్త వేరియంట్ - ఓమిక్రాన్ ఆవిర్భావం వల్ల కలిగే ముప్పు నేపథ్యంలో   ముందు జాగ్రత్త చర్యలను కఠినంగా అమలు చేయాలని కర్ణాటక నిర్ణయించింది. కోవిడ్-19 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టిఏసి) ప్రభుత్వానికి చేసిన సిఫార్సుల ప్రకారం,  ఓమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగు చూసిన  దేశాల నుంచి వచ్చిన వారి కోసం అధికారులు  ఆర్టి పిసిఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి గమనాగమనాలకు ట్రాక్ చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.పది రోజుల పాటు  ఐసోలేషన్‌లో ఉంచుతామని ప్రకటించింది.
"దక్షిణాఫ్రికా, బోట్స్వానా, హాంకాంగ్ నుంచి గత 15 రోజులలో (నవంబర్ 12 నుండి) వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులందరినీ ట్రాక్ చేస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తమిళనాడు ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద ప్రత్యేక వైద్య బృందాలను నియమించింది. చెన్నై నగరంతో పాటు,. తిరిచ్చి, కోయంబత్తూర్, మధురై విమాశ్రయాల్లోనూ  రాష్ట్ర ప్రభుత్వం వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. విదేశాలనుంచి వచ్చిన వారిని క్వారంటైన్ కు తరిలిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ముందస్తు చర్యలుతీసుకుంది. ఆ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ తో పాటు వివిధ శాఖల అధికారులను అలర్ట్ చేశారు. వివిధ శాఖల సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే  గ్రామ స్థాయి నుంచి  వివరాలను సేకరించినట్లు కేంద్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: