రాష్ట్రంలో 90 అసెంబ్లీ సెగ్మెంట్ల పై బిజెపి స్పెషల్ ఫోకస్ పెట్టింది. రీసెంట్ గా ఢిల్లీకి వెళ్లిన పార్టీ నేతల ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా 90 ఫార్ములాను ఉంచారు. టిఆర్ఎస్ లో దెబ్బ కొట్టాలన్నా, అధికారంలోకి రావాలన్నా దీన్ని ఫాలో కావాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు 2023 లో వచ్చినా, అంతకు ముందే వచ్చినా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 90 చోట్ల బలమైన అభ్యర్థుల్ని తయారు చేయాలని ఆ తర్వాత గెలుపు సంగతి తమకు వదిలేయాలని అమిత్ షా చెప్పినట్లు పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు తమకు సానుకూలమైన నియోజకవర్గాలను గుర్తించే పనిలో పడ్డారు.

 దుబ్బాక,హుజురాబాద్ బైపోల్ ల్లో పార్టీ తరఫున గట్టి అభ్యర్థులు ఉండటంతోనే విజయం సాధ్యమైందని బీజేపీ అధిష్టానం అంచనాకు వచ్చింది. పార్టీ అభ్యర్థులు వీక్ గా ఉన్నందుకే హుజూర్నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయిందని చెప్పుకొచ్చింది. వరుసగా జరిగిన ఎన్నికల ఫలితాలు బేరీజు వేసుకుని అమిత్షా నియోజకవర్గస్థాయిలో సమర్థులైన అభ్యర్థులు ఉండాలని  పార్టీ రాష్ట్ర నేతలకు సూచించారు. లేకుంటే క్యాడర్ ఉన్నా గెలుపు కష్టమవుతుందని అలెర్ట్ చేసినట్లు తెలుస్తోంది. క్యాడర్ ఉన్న నియోజకవర్గాలు ఎన్ని.., బలమైన లీడర్లు ఉన్న నియోజకవర్గాలు ఎన్ని..ఎక్కడ కొత్త అభ్యర్థులు అవసరం అనే దానిపై బిజెపి ఫోకస్ పెట్టింది. ఇప్పటికి ఇప్పుడు రాష్ట్రంలో బిజెపికి 30 నుంచి 35 సెగ్మెంట్లలో టిఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొనే క్యాండెట్ లు ఉన్నారు. ఈ లెక్కన మిగతా నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులు అవసరం. ఈ సెగ్మెంట్ల ను గుర్తించి అక్కడ టిఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన అసంతృప్తి, అసమ్మతి వాదులను  పార్టీలో చేర్చుకోవాలని బిజెపి భావిస్తోంది. రాష్ట్రంలో పవర్ లోకి రావాలంటే 60 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటి సీట్లను గెలుచుకోవాలి. కనీసం 60 సీట్లలో పార్టీ తిరుగులేని శక్తిగా నిలబడితే 60 నుంచి 70 సీట్లు గెలుచుకోవచ్చని బీజేపీ హైకమాండ్ నమ్ముతోంది. స్వయంగా అమిత్ షానే రంగంలోకి దిగి రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఇదే క్రమంలో ఈ నెల 21వ రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రానికి చెందిన జాతీయ నేతలతో ఢిల్లీలో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎగిరేది బిజెపి జెండానే అనే భరోసాను ఇక్కడి నేతల్లో కలిగించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన పునాదులు  నిర్మించుకోవాలని, క్యాడర్ ఎంత ముఖ్యమో వారిని నడిపే లీడర్లు కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. కనీసం 90 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను తయారు చేసుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: