బీజేపీ లీడ‌ర్ సోము వీర్రాజు ఏం చెప్పినా వింత‌గా ఉంటుంది.ఆయ‌న చెప్పే వాటిపై ఆయ‌న‌కొక క్లారిటీ అన్న‌ది ఉండ‌దు. ఉండ‌క‌పోగా అంద‌రిపై ఆయ‌న కోపం అవుతారు. కోపం అయి కూడా  త‌న కోపంకు కార‌ణానికి వెతుక్కోరు.అందుకే త‌రుచూ త‌గాదాలు వ‌స్తున్నా కూడా బీజేపీని సామర‌స్య పూర్వ‌కంగానే అర్థం చేసుకునేందుకు వైసీపీ ఓ ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది.


రాష్ట్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న హిందూ వ్య‌తిరేక విధానాల‌కు నిర‌స‌న‌గా భోగి మంట‌లు వేయాల‌ని పిలుపు నిచ్చారు బీజేపీ లీడ‌ర్ సోము వీర్రాజు.. ఇదీ ప్ర‌ధాన మీడియా చెబుతున్న విష‌యం.అయినా పండ‌గ వేళ ఎందుకీ అత్యుత్సాహం. నిర‌స‌న‌లు తెల‌ప‌డానికి వేరే సంద‌ర్భ‌మే లేదా? లేకా ఇదొక్క‌టే సరైన సంద‌ర్భం అని భావిస్తున్నారా? ఒప్పుకోవాలి హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా బీజేపీ ప‌నిచేస్తుంద‌ని,అందుకు త‌గ్గ కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు వెళ్తుంద‌ని! కానీ మ‌రీ! భోగీ మంట‌ల‌తో నిర‌స‌న చెప్పి

ఏం సాధిస్తార‌ని!

భోగి పండ‌గ వేళ వైసీపీ రాజకీయం వేరు..బీజేపీ రాజ‌కీయం వేరు అని తేలిపోయింది.భోగీ పండుగ వేళ ఎవ‌రి మంట‌లు వారివి. ఎవ‌రి త‌గువులు వారివి.విశిష్టం అయిన త‌గువు ఒక్క‌టీ లేదు.పోనీ ప్ర‌త్యేకం అయిన త‌గువు ఒక్క‌టీ లేదు.కానీ బీజేపీ కొంచెం ఎక్కువ కోపంతో ర‌గిలిపోతోంది.ఇలానే జ‌న‌సేన కూడా ఎక్కువ కోపం ర‌గిలిపోయి ఇవాళ కొన్ని చోట్ల సాక్షి పేప‌ర్ ను భోగి మంట‌ల్లో వేసింది.అది త‌ప్పు అని వారికి తెలియ‌జెప్పినా విన‌రు.ఇక జ‌న‌సేన కోపం ఒక‌లా ఉంటే బీజేపీ కూడా బాగా కోపం ఉంది.జ‌గ‌న్ ను తిడుతోంది.ఆయ‌న‌పై అన్యాయం అయిన కోపం ఒక‌టి చూపిస్తోంది.దేవాల‌య‌ల‌పై దాడుల‌కు నిర‌స‌న‌గా ఎక్క‌డిక‌క్క‌డ భోగి మంట‌లు వేయాల‌ని ఆదేశించారు సోము వీర్రాజు.అయినా పండ‌గ వేళ నిర‌స‌న‌లేంటి స‌ర్..కాస్తైనా ఆలోచించాలి క‌దా! ఒప్పుకుంటాం ఒక‌ప్పుడు సంక్రాంతి వేరు ఇప్ప‌టి సంక్రాంతి వేరు అని.. ఒక‌ప్ప‌టి స‌మ‌స్య‌లు వేరు ఇప్ప‌టి స‌మ‌స్య‌లు వేరు అని కానీ మ‌రీ ఇంత‌గా రాజకీయం చేయ‌డంలో వాస్త‌వం లేదు. న్యాయ స‌మ్మ‌తి అస్స‌లు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp