పాకిస్తాన్లో తాలిబాన్ల వ్యవహారం రోజురోజుకు హాట్ టాపిక్ గా మారిపోతుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుత పాలన సాగిస్తాము అంటూ తాలిబన్లు ఎన్నో చెప్పారు. మేము మారిపోయావు ఒకప్పటిలా కాదు అంటూ ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మళ్లీ అసలు రంగు బయట పెడుతూ కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్నారు. దీంతో తాలిబన్ల పాలనలో ఆటోఅటు దేశ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తాలిబన్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రపంచ దేశాలు ఆఫ్ఘనిస్తాన్ తో ఉన్న అన్ని సంబంధాలను పూర్తిగా తెంచుకున్నాయ్.



 ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ లో రోజురోజుకు ఆర్థిక సంక్షోభం పెరిగిపోతూనే ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించిన నిధులు ఇతర దేశాల్లో ఉన్నాయి. ఆయా దేశాలు తాలిబన్ల ప్రభుత్వానికి నిధులు ఇవ్వలేము అంటూ స్పష్టం చేసాయి. దీంతో ఎలాంటి ఆదాయం లేక ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు రోజుకో అద్వానంగా మారిపోతున్నాయి. అయితే తాలిబన్లు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ప్రజలకు ఎక్కడ ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎంతో మంది కనీసం మూడు పూటలా తినలేక పోతున్నారు. అయితే ఒకవైపు ఆర్థిక సంక్షోభం మరోవైపు ఆహార సంక్షోభం పెరిగిపోతున్న సమయంలో ఇటీవలే తాలిబన్లు ఏకంగా ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టడం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఇప్పటికే ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో భారత్ నుంచి పంపించిన గోధుమలు జీతంగా చెల్లిస్తుంది. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ల ప్రభుత్వ ఇప్పుడు ఒక ఉపాధి పథకం ప్రవేశపెట్టింది. అయితే ఈ ఉపాధి పథకంలో కూడా ప్రజలందరికీ కేవలంగోధుమలు మాత్రమే పంచుతూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఉపాధిహామీ కింద పంచుతున్న గోధుమలు కూడా భారత్ నుంచి పంపించినవి కావడంతో ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో ఎంత దారుణం పరిస్థితులు ఉన్నాయి అన్నది అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: