రెడ్డి వ‌ర్గం జోరు త‌గ్గిందా?  లేక వారే జోరు ఎందుకులే అనుకున్నారా?  ఇదీ..ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో జోరుగా సాగుతున్న చ‌ర్చ‌. కోరుకున్న ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకోవ‌డంలో స‌క్సెస్ అయిన రెడ్డి సామాజిక వ‌ర్గం.. త‌ర్వాత మాత్రం యాక్టివ్‌గా క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డా వారి జోరు క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల కాలంలో ఇత‌రత్రా సామాజిక వ‌ర్గాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. రెడ్డి వ‌ర్గం మాత్రం సైలెంట్‌గా నే ఉంటోంది. పైగా.. అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్య‌ల‌తో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు నాయ‌కులు రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నారు.

దీనివ‌ల్ల పార్టీకి ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని.. రెడ్డి వ‌ర్గంలోనూ చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల నెల్లూరు జిల్లాకు చెందిన కోవూరు ఎమ్మెల్యే ప్ర‌స‌న్న కుమార్‌రెడ్డి సినిమా రంగంలోని నిర్మాత‌ల‌ను ఉద్దేశించిన బ‌లిసినోళ్లు అని కామెంట్ చేశారు. ఇది త‌ర్వాత తీవ్ర వివాదానికి దారితీసింది. బ‌లిసినోళ్లు ఎవ‌రో అంద‌రికీ తెలిసిందే.. అంటూ.. ఎదురు దాడి జ‌రిగింది. దీనికి కౌంట‌ర్ ఇచ్చేందుకు అదే రెడ్డి వ‌ర్గం నుంచి ఎవ‌రూ ముందుకురాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో సినిమా రంగంలోని ప‌లువురు రెడ్డివ‌ర్గానికి చెందిన ప్ర‌ముఖులు కూడా.. ఏపీలో నెల‌కొన్ని ధియేట‌ర్ల స‌మ‌స్య‌, టికెట్ల ధ‌ర‌ల త‌గ్గింపు అంశంపైమాట్లాడేందుకు జంకుతున్నారు.

దీనికి ప్ర‌ధాన‌కార‌ణం.. తాము నోరు విప్పినా.. ఇప్పుడు ఏపీలో నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఎవ‌రూ త‌మ‌తో క‌లిసి వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని.. నాయ‌కులు అంద‌రూ మౌనంగా ఉన్నార‌ని వారు భావిస్తున్నారు. ఇదిలావుంటే, రాజ‌కీయంగా చూసుకున్నా.. టీడీపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చే రెడ్డి నేత‌లు కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో రెడ్డి నాయ‌కుల జోరు ఎందుకుత‌గ్గింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. వారంతా ఉద్దేశ పూర్వంగా నే ప్ర‌భుత్వంపై సైలెంట్ వార్ చేస్తున్నారా?  లేక‌.. ఏదైనా కార‌ణం ఉందా? అని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

జ‌గ‌న్ అధికారంలోకిరావాల‌ని.. కోరుకున్న రెడ్డి వ‌ర్గం..ఇప్పుడు సైలెంట్ వెనుక‌..పార్టీ అధిష్టాన‌మే ఉంద‌నే చ‌ర్చ కూడా సాగుతోంద‌ని అంటున్నారు. రెడ్లు స్పందిస్తే.. ప్ర‌భుత్వంపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని.. ప్ర‌భుత్వానికి రెడ్డి ట్యాగ్ త‌గిలించేందుకు ప్ర‌తిప‌క్షాలు చూస్తున్నాయ‌ని.. అంద‌కే వారిని సైలెంట్ చేశార‌ని అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు రెడ్డి వ‌ర్గం ప్ర‌భావంతోపాటు.. వారి స్పంద‌న కూడా అంతంత మాత్రంగానే ఉండ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: