ప్రపంచాన్ని రెండేళ్లుగా పట్టిపీడిస్తున్న కోవిడ్ మహమ్మారి ముగింపు దశకు చేరుకుందా..? కొత్తరకం వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తి దీనికి సంకేతమా..? అంటే అవును అనే సమాధానం ఇస్తోంది డబ్ల్యుహెచ్వో. ఓమిక్రాన్ వేరియంట్, కోవిడ్-19 మహమ్మారిని కొత్త దశకు తీసుకెళ్ళిందని ఐరోపాలో ముగింపునకు చేరుకోవచ్చని తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ యూరప్ విభాగం డైరెక్టర్  హాల్స్ క్లూగే.

అక్కడ కరోనా ఒక ముగింపు దిశ వైపు మహమ్మారి కదులుతూ ఉన్నట్లుగా అనుకున్నట్టు తెలిపారాయన. మార్చి నాటికి ఐరోపాలో 60 శాతం మంది  ఓమిక్రాన్ బారిన పడే అవకాశం ఉంది. ప్రస్తుతం యూరప్ అంతటా ఉప్పెనలా వ్యాపిస్తున్న  ఓమిక్రాన్ వ్యాధి తగ్గిన తర్వాత కొన్ని వారాలు,నెలలపాటు అక్కడి ప్రజలకు ఇమ్యూనిటీ ఉంటుంది. అటు వ్యాక్సిన్ తో కూడా ఇమ్యూనిటీ  పెరగడంతో వైరస్ ప్రభావం అక్కడ తగ్గుతుందనే అంచనా వేశారు క్లూగే. కొవిడ్-19 వ్యాప్తి ఈ ఏడాది చివరి నాటికి నెమ్మదించ్చ వచ్చని ఆయన అంటున్నారు. ఆ తర్వాత ఇంతలా మరొకసారి కరోనా వ్యాప్తి ఉండకపోవచ్చని ఒక అంచనా. అమెరికాలోని టాప్ సైంటిస్ట్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఊరట కలిగిస్తోంది. ఈవారం అమెరికాలోని పలు ప్రాంతాల్లో  కరోనా కేసుల్లో భారీ తగ్గుదల ఉంటుందని,పరిస్థితులు కుదుట పడతాయని అన్నారు ఫౌచీ. అమెరికా ఈశాన్య ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఇటీవల తగ్గుదల కొనసాగితే దేశమంతటా ఇలాగే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటు డబ్ల్యూహెచ్వో ఆఫ్రికా ప్రాంతీయ కార్యాలయం కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. గత వారం నుంచి అక్కడ కోవిడ్ కేసులు క్షీణించాయని ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో నాలుగో వేవ్ గరిష్టస్థాయికి చేరుకున్నప్పటికీ మరణాలు మొదటిసారిగా తగ్గుతున్నాయని ప్రకటన విడుదల చేసింది.

ఇతర వేరియంట్ ల కంటే ఓమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది.అయితే సాధారణంగా టీకాలు తీసుకున్న వారికి ఇన్ఫెక్షన్ తీవ్రత తగ్గుతోంది. కోవిడ్-19 ఒక మహమ్మారి నుంచి సీజనల్ ఫ్లూ వంటి స్థానిక వ్యాధి కి మారడం ప్రారంభిస్తుందని చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆశలను పెంచింది. కానీ కోవిడ్-19 స్థానికంగా పరిగణించడం తొందరపాటే అవుతుందని హెచ్చరించారు క్లూగే. ముగింపు కాని మహమ్మారి అంటే ఏం జరగబోతుందో ఊహించడం అసాధ్యం అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ వైరస్ ఒకటి కంటే ఎక్కువసార్లు ఇబ్బందులకు గురి చేసింది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు క్లూగే.

మరింత సమాచారం తెలుసుకోండి: