సుప్రింకోర్టు గనుక ఆపని చేస్తే దేశానికి పట్టిన పెద్ద దరిద్రం వదిలిపోతుంది. దేశంలో ఉచితాలంటు ఇచ్చే హామీలే కనబడకూడదంటే సుప్రింకోర్టు అంకుశం పట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ విషయంలో సుప్రింకోర్టు గట్టిగా ఉండాల్సిందే. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్నికల్లో ఓట్ల కోసం రాజకీయపార్టీలిచ్చే ఉచిత హామీలపై సుప్రింకోర్టు మండిపడింది. ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీల అధినేతలిచ్చే ఉచిత హామీలు చివరకు రాష్ట్ర బడ్జెట్ ను కూడా దాటిపోతోందని ఆందోళన వ్యక్తంచేసింది.




ప్రజల డబ్బులతో ఎన్నికల్లో గెలవటానికి రాజకీయపార్టీలు ఇస్తున్న ఉచిత హామీలను బ్యాన్ చేయాలని, పార్టీల ఎన్నికల గుర్తులను స్తంబింపచేయాలని, రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలంటు బీజేపీ నేత, లాయర్ అశ్విన్ ఉపాధ్యాయ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. దానిపై మంగళవారం సుప్రింకోర్టులో విచారణ జరిపింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతు ఉచిత హామీలపై ఆందోళన వ్యక్తంచేశారు.




ఆచరణ సాధ్యంకాని విషయాలను కూడా రాజకీయపార్టీలు ఉచిత హామీల రూపంలో జనాలకు ఇచ్చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. కేవలం ఓట్లకోసం ఉచితహామీలివ్వటం పూర్తిగా చట్టవిరుద్దమైన చర్యగా ప్రకటించారు. తొందరలోనే జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనే దీనికి అడ్డుకట్ట వేయగలమా ? లేకపోతే వచ్చే ఎన్నికల్లో చేయగలమా అని విచారణ సందర్భంగా ప్రశ్నించారు. ఓటర్లకోసం ఉచితహామీలిచ్చి లబ్దిపొందటం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు.




ఇలాంటి ఉచితహామీలను పూర్తిగా నిషేధించాల్సిందే అని చీఫ్ జస్టిస్ గట్టిగా చెప్పారు. ఇదే విషయమై కేంద్ర ఎన్నికల కమీషన్, కేంద్రప్రభుత్వాలు సమాధానం చెప్పాలంటు నోటీసులు కూడా జారీచేశారు.  సరే ఇక ప్రస్తుత విషయానికి ఏపీ విషయం తీసుకుంటే ఓట్ల కోసమని ఏపీలో చంద్రబాబునాయుడు, లోకేష్ పోటీపడి ఇచ్చిన హామీల వల్లే రాష్ట్ర ఖజనా గుల్లైపోయింది. రాష్ట్ర విభజనతో అసలే ఆర్ధికంగా దెబ్బతినేసిన రాష్ట్రమని కూడా చూడకుండా చంద్రబాబు, జగన్ పోటీలుపడి తాయిలాలు ప్రకటించేశారు.




మొదటి సీఎం అయిన చంద్రబాబు బాటలోనే ఇపుడు జగన్ కూడా నడుస్తుండటంతో లక్షల రూపాయల అప్పులు పెరిగిపోయాయి. ఉచితహామీలు ఏపీలో మాత్రమే కాదు దేశమంతా ఇదే పరిస్ధితి. సుప్రింకోర్టు దెబ్బకు ఉచితహామీలన్నీ ఆగిపోతే అప్పుడు కేవలం అభివృద్ధి అంశాల మీదే ఎన్నికలు జరుగుతాయి. అప్పుడన్నా రాష్ట్రాలు బాగుపడతాయేమో చూడాలి. ఈ ఉచితాలకు సుప్రింకోర్టు గనుక బ్రేకులు వేయకపోతే దేశం అధోగతిపాలు కావటం తథ్యం.







మరింత సమాచారం తెలుసుకోండి: