హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి ఇక యాదాద్రి పుణ్య క్షేత్రానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక యాదాద్రి సందర్శనలో భాగంగా పునః సంప్రోక్షణ కోసం సుదర్శన యాగం ఇతర ఏర్పాట్లపై కూడా ఇక యాదాద్రి ఆలయ అధికారులతో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అతిథులు, పీఠాధిపతులు, ఉద్యోగులు, భక్తుల వసతుల పనులు ఎంత వరకు వచ్చాయి అన్న విషయాన్ని కూడా స్వయంగా పరిశీలించి పోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆలయ దివ్య విమాన స్వర్ణ తాపడం, ధ్వజస్తంభం పనులను ఎక్కడ వరకు వచ్చావు అన్న విషయాన్ని అడిగి తెలుసుకోనున్నారు.
ఇక అదే సమయంలో యాదాద్రి అధికారులతో ఉన్నత సాయి సమావేశం నిర్వహించేందుకు కూడా కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక దీనికోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. యాదాద్రి అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంతోపాటు టెంపుల్ సిటీ, కాటేజీల నిర్మాణాలు, విద్యుదీకరణ, కల్యాణ కట్ట, దీక్షాపరుల మండపం, అన్నప్రసాదం, వ్రత మండపం, గండి చెరువు సుందరీకరణ, బస్ టెర్మినళ్ల వంటి నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రధానాలయంలో పరంజాలు కడుతుండగా బస్‌బేలు, సత్యనారాయణ వ్రత మండపం, అన్నదాన కేంద్రానికి శ్లాబులను ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరిణి, దీక్షాపరుల మండపం పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రధానాలయానికి స్వాగత తోరణం, ఫ్లైఓవర్ల పనులు జరుగుతున్నాయి. మెట్ల నిర్మాణం పూర్తికావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి