రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు పని చేస్తున్నా కానీ వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా, ఆగమ్యగోచరంగా తయారైంది. ఎన్నో బాధ్యతలతో ప్రజలకు అందుబాటులో ఉంటూ పనులు చేస్తున్న వీఆర్ఏ లకు గుర్తింపు లేకుండా పోతోంది. దాదాపు తెలంగాణ మొత్తం 22 వేల మంది సిబ్బంది పరిస్థితి ఎడారిలో నీటి కోసం వెతికిన మనిషిలా  తయారైంది. సంవత్సరాల తరబడి పదోన్నతులు, వేతనాలు పెరగకపోవడం దీనికి తోడుగా ఈ వీఆర్వోల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ముందు ముందు భవిష్యత్తు ఏంటనే ఆవేదనలో వీఆర్ఏలు ఉన్నట్టు తెలుస్తోంది..!

మరి వీరిని రెవెన్యూ శాఖలోనే కొనసాగిస్తారా.. లేదా ఇతర శాఖలకు పంపుతారా..మరి ఎంత మందిని కొనసాగిస్తారు.. అసలు ఈ ఉద్యోగం ఉంచుతారా.. ఉడగొడతారా  అనే సందేహాలు వీఆర్ఏ ల లో వస్తున్నాయి. వారికి పే స్కేల్ వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ లో చెప్పి ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతున్నా అమలు కాకపోవడంతో వీఆర్ఏలు ఆందోళన బాట పడుతున్నారు. క్షేత్ర స్థాయిలో జరిగే టువంటి రెవెన్యూ కార్యకలాపాలకు సహాయకులుగా ఉండడానికి సర్కార్ వీఆర్ఏలను నియమించింది. వీరిలో కొందరిని మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ తో భర్తీ చేస్తుండగా, చాలా మందిని నేరుగా  నియమించింది. 2007 నుండే వీరికి నెలకు10500 జీతం ఇస్తున్నారు. టి ఏ మరియు డిఏలు కలిపి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 11 వేల నాలుగు వందలు, పట్టణాల్లో అయితే 11500 చొప్పున వేతనం వస్తున్నది. అయితే వీరికి ఉద్యోగ భద్రత లేకుండా ఉండడంతో  వారికి పే స్కేల్ వర్తింపచేయాలని వీఆర్ఏ లంతా చాలాకాలంగా ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు.

 ఇది అమల్లోకి వస్తే వారికి హెల్త్ కార్డులతో పాటు అన్ని రకాల అలవెన్సులు వస్తాయని ఆలోచనతో ఉన్నారు. అయితే వీఆర్ఏ వ్యవస్థను రద్దుచేసి వారికి పే స్కేల్ వర్తింప చేస్తామని స్వయానా సీఎం అసెంబ్లీ లో హామీ ఇచ్చారు. వారసత్వ ఉద్యోగాలకు అవకాశం ఇవ్వడమే కాకుండా, పదోన్నతులు ఇస్తామని  తెలియజేశారు. కానీ ఇంకా అమలు చేయలేదు.

3 రకాలుగా వర్గీకరణ..?
 రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్నటువంటి వీఆర్ఏల ను మూడు రకాలుగా వర్గీకరించాలని ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. మూడు వేల మూడు వందల మందికి పైగా వీఆర్ఏ ల ను సాగునీటి శాఖలో పంపాలని, ఇంకా మిగిలిన వారిని స్కిల్డ్, మరియు అన్ స్కిల్డ్ పేరుతో వర్గీకరణ చేశారు. స్కిల్డ్ వారిని రెవెన్యూ శాఖలోనే కొనసాగించి, గ్రామానికి ఒక్కరినీ పంపాలని సర్కార్ భావిస్తోంది. ఇందులో మిగిలిన 8 నుండి 9 వేల మందిని అన్ స్కిల్డ్ కేటగిరీలో చేర్చగా ఏం చేస్తారో తెలియడం లేదు. ఈ సందర్భంలోనే వీఆర్ఏలు సోమ, మంగళ వారాల్లో ధర్నా చేపట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్ఏ మరియు విఆర్ఓల సమస్యలు పరిష్కరించాలని డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏల సంఘం గౌరవ అధ్యక్షులు వింజమూరు ఈశ్వర్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: