కేసీఆర్‌కు మొదట నుంచి తన సామర్థ్యం కంటే...ప్రత్యర్ధుల బలహీనతని ఆధారంగా చేసుకుని రాజకీయంగా బలపడటం అలవాటు అని చెప్పొచ్చు. తన బలంతో గెలవడం కంటే ప్రత్యర్ధి బలహీనతతో గెలవాలని చూస్తూ ఉంటారు...అసలు మొదట నుంచి కేసీఆర్ అదే పనిలో ఉంటారనే సంగతి తెలిసిందే..అలాగే గెలుస్తూ కూడా వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఏదో తెలంగాణ సెంటిమెంట్‌తో బొటాబోటి మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చారు.

ఇక తర్వాత నుంచి ప్రత్యర్ధి పార్టీలని వీక్ చేసుకుంటూ...కేసీఆర్ సత్తా చాటుతూ వస్తున్నారు..టీఆర్ఎస్ బలం పెంచుకుంటూ వస్తున్నారు. అంటే ప్రత్యర్ధుల బలాన్ని తన బలంగా మార్చుకుంటూ వచ్చారు తప్ప సొంతంగా మాత్రం పైకి రాలేదని చెప్పొచ్చు. అలాగే 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా కేవలం ప్రత్యర్ధిని నెగిటివ్ చేసి గెలిచారు. అసలు 2018 ఎన్నికల ముందు టీఆర్ఎస్‌పై బాగా వ్యతిరేకత పెరిగిందని ప్రచారం వచ్చింది. అలాగే ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళితే ఎక్కడకక్కడ ప్రజలు అడ్డుకోవడం, సమస్యలపై నిలదీయడం జరిగింది.

ఇలాంటి పరిస్తితుల్లో మళ్ళీ టీఆర్ఎస్ గెలవడం కష్టమని అంతా అనుకున్నారు..ఇలా ఇలాంటప్పుడే కేసీఆర్‌కు చంద్రబాబు రూపంలో ఒక అడ్వాంటేజ్ వచ్చింది. అప్పుడు తెలంగాణలో బలం  లేకపోయినా సరే చంద్రబాబు, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని, కేసీఆర్‌కు చెక్ పెట్టాలని చూశారు. కానీ ఇదే కేసీఆర్‌కు ప్లస్ అయింది...అదిగో మళ్ళీ చంద్రబాబు తెలంగాణలోకి వచ్చారు...మళ్ళీ ఆంధ్రాలో పెత్తనం పెరుగుతుంది..మళ్ళీ తెలంగాణని దోచుకోవడానికి వచ్చారని చెప్పి కేసీఆర్ ప్రచారం చేశారు.

ఇక ఎన్నికల్లో టీఆర్ఎస్ శ్రేణులు తాము చేసిన పనులు చెప్పడం మానేసి...చంద్రబాబుని బూచిగా చూపి ప్రచారం చేశాయి..దీంతో తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ వచ్చింది..అదే టీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్ అయింది..మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది. అయితే మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న కేసీఆర్..ఇప్పుడు మోదీని బూచిగా చూపించాలని ట్రై చేస్తున్నారు. అసలు మోదీ వల్ల తెలంగాణ నాశనమైపోతుందనే కోణం తీసుకురావాలని చూస్తున్నారు..మరి ఈ సారి మోదీ రూపంలో బూచి వస్తుందని చెప్పి కేసీఆర్ రాజకీయంగా లబ్ది పొందుతారో లేదో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: