తూర్పు గోదావరి జిల్లాలో పలు నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోటలుగా ఉన్నాయని చెప్పొచ్చు...అలా వైసీపీకి కంచుకోటగా ఉన్న స్థానాల్లో కొత్తపేట కూడా ఒకటి. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది...కాకపోతే అదృష్టం కొద్ది రెండుసార్లు స్వల్ప మెజారిటీలతో గెలిచింది. చిర్ల జగ్గిరెడ్డి...2014లో 713 ఓట్ల మెజారిటీతో, 2019లో 4038 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇలా రెండుసార్లు తక్కువ మెజారిటీలతోనే జగ్గిరెడ్డి గెలిచారు.

అయితే ఇక్కడ టీడీపీ గెలిచి చాలా ఏళ్ళు అయిపోతుంది...ఎప్పుడో 1999 ఎన్నికల్లో చివరి సరిగా కొత్తపేటలో టీడీపీ గెలిచింది..2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. ఇక 2004లో కాంగ్రెస్ నుంచి జగ్గిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన బండారు సత్యానందరావు 2009లో ప్రజారాజ్యం నుంచి గెలిచారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

మరి 2024 ఎన్నికల్లో కొత్తపేట బరిలో ఎవరు గెలుస్తారనే చర్చ ఇప్పటినుంచే నడుస్తోంది. ప్రస్తుతం కొత్తపేటలో వైసీపీ బలంగానే కనిపిస్తోంది..అంటే అధికార బలం ఉండటం వల్ల కాస్త స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది...కాకపోతే క్షేత్ర స్థాయిలో చూస్తే వైసీపీ బలం తగ్గుతున్నట్లే కనిపిస్తోంది. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పనితీరు విషయంలో గాని, వైసీపీ పాలన విషయంలో గాని కొత్తపేట ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు. 2014లో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పెద్దగా పనులు చేయలేకపోయారు...మరి 2019 ఎన్నికల్లో అధికారంలో ఉన్నా సరే ఏమి చేయలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ రెండున్నర ఏళ్లలో కొత్తపేటలో వచ్చిన మార్పులు పెద్దగా లేవు.

దీంతో ఎమ్మెల్యేకు బాగా నెగిటివ్ అవుతుంది...అటు టీడీపీ నేత బండారు దూకుడుగా పనిచేస్తున్నారు...ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు...అలాగే రెండుసార్లు వరుసగా స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన సానుభూతి బండారుపై ఉంది...ఈ సారి కొత్తపేట ప్రజలు బండారు వైపు మొగ్గు చూపేలా ఉన్నారు..ఈ సారి జనసేన కలిస్తే ఓకే...లేకపోయినా సరే కొత్తపేటలో మాత్రం టీడీపీకే లీడ్ ఉన్నట్లు కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: