ఏపీలో ముందస్తు ఎన్నికలొస్తున్నాయనే ప్రచారం ఇటీవల చంద్రబాబు మొదలు పెట్టారు. గతంలో ఓసారి వైసీపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. ఇంత పెద్ద విజయం సాధించిన తాము ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కానీ బాబు మరోసారి ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే చేశారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని జోస్యం చెప్పారు. పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దానికి ఆయన కొన్ని లాజిక్ లు కూడా చెప్పారు. గడప గడప కార్యక్రమంలో ప్రభుత్వంపై వ్యతిరేక తెలిసిందని, దాన్ని పెంచి పెద్దది చేసుకోడానికి ముందే ఎన్నికలకు వెళ్లాలని జగన్ అనుకుంటున్నారని అన్నారు చంద్రబాబు.

నిజంగానే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది కాస్త ఆలోచించాలి. ప్రస్తుతానికి వైసీపీ ప్రభుత్వంపై మరీ అంత వ్యతిరేకత లేదు. ఒకటి రెండు ఉదాహరణలు, సంఘటనలు.. టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న రాద్ధాంతాలుగా పరిగణిస్తున్నారే కానీ.. జనాల్లో నిజంగా జగన్ పై అభిమానం తగ్గిపోయిందనే మాట వినపడటంలేదు. పోనీ నిజంగానే తగ్గిపోతోందనుకుంటే.. ముందస్తుకి వెళ్లి ప్రయోజనం ఏంటి..? బాబు చెప్పారు ఎన్నికలొచ్చాయని టీడీపీ రెచ్చిపోతుంది కదా. అంటే బాబు మాట ప్రకారం ఎన్నికలొచ్చాయంటే, ఆయన మాట ప్రకారం వ్యతిరేకత కూడా ఉన్నట్టే కదా. సో.. చంద్రబాబు ట్రాప్ లో పడి జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు.

ముందస్తు ఎన్నికలొస్తున్నాయి తమ్ముళ్లూ జాగ్రత్తపడండి అంటూ బాబు ముందుగానే తమ పార్టీ నేతలకు ధైర్యం చెబుతున్నారు. గతంలో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికలకోసం పట్టుబట్టారు. తిరుపతి ఉప ఎన్నికలప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత బయపడుతుందని చెప్పారు. కానీ ఏదీ జరగలేదు. ఇప్పుడు కూడా పార్టీ శ్రేణుల్ని చురుకుగా ఉంచేందుకే ఆయన ముందస్తు రాగం ఆలపిస్తున్నారని తెలుస్తోంది. పోనీ ముందస్తు ఎన్నికలొచ్చినా చంద్రబాబు ఊహిస్తున్నట్టు టీడీపీపై జనాలకు అంత ప్రేమ పెరిగిందా లేదా అనేది ఆలోచించాలి. మొత్తమ్మీద జగన్ ముందస్తుకి వెళ్లే ఆలోచన లేదని మాత్రం అర్థమవుతోంది. ఒకవేళ అదే నిజమైతే.. కచ్చితంగా జగన్, చంద్రబాబు ట్రాప్ లో పడినట్టే. సరైన కారణం లేకుండా ముందస్తుకి వెళ్తే.. ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: