వివాదాల దర్శకుడు వర్మ ఎప్పుడూ ఏదొక వార్త తో నిలుస్తూ హైలెట్ అవుతారు...సినిమాలను, రాజకియాలను కూడా వదలకుండా తనకు ఏదనిపిస్తె అది చేస్తూ అందరితో మాటలు పడుతున్నారు..ప్రతిసారి ఎదో ఒక కాంట్రవర్షియల్ ట్వీట్ చేసి వార్తల్లో నిలుస్తాడు. నలుగురు ఒకలా ఉంటే, ఆయన మాత్రం మరోలా ఉంటాడు. అందుకే వర్మ చాలా మంది లైక్ చెయ్యరు..ప్రస్తుతం దేశంలో రాష్ట్రపతి ఎన్నిక గురించే చర్చ నడుస్తుంది. అధికార పక్షం నుంచి ద్రౌపది ముర్ము, ప్రతీకార పక్షం నుంచి యాశ్వంత్ సిన్హాని ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థులుగా ప్రకటించారు.


రెండు రోజుల క్రితం వర్మ ద్రౌపది ముర్ము పై ట్వీట్ చేస్తూ.. ద్రౌపది ఉన్నారు, మరి కౌరవులు ఎవరు? పాండవులు ఎవరు అంటూ పోస్ట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ వివాదానికి దారి తీసింది. పలువురు నాయకులు వర్మని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసులు కూడా పెట్టారు. ఆ తర్వాత వర్మ మహాభారతంలో ద్రౌపది క్యారెక్టర్ అంటే నాకు ఇష్టమని అంటూ ఏదో వివరణ ఇస్తూ మరో ట్వీట్ చేశాడు..మొన్న ఆయన చేసిన ట్వీట్ దుమారం రేపింది.


రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది పై వర్మ మరో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో వర్మ.. 'గౌరవనీయులైన ద్రౌపది జీపై నేను విస్తృతమైన పరిశోధన చేశాను. ఆ పరిశోధనలో ఆమె కళ్ల తీవ్రత, ఆమె చిరునవ్వు మరియు ముఖ రూపురేఖలు, వాటిని చూస్తే అర్థమైపోతుంది ఆమె ప్రపంచం మొత్తంలో గొప్ప రాష్ట్రపతి అవుతారు. ఆమె స్మైల్ చూస్తే హార్ట్ లోంచి వచ్చినట్టు ప్యూర్ గా ఉంది. కౌరవులు, పాండవులు పక్కనపెడితే ఈ ద్రౌపదిని అందరూ కలిసి గెలిపించుకొని కొత్త మహాభారతం రాస్తారు. థ్యాంక్యూ బీజేపీ' అని పోస్ట్ చేశారు. వర్మ చేసిన ఈ ట్వీట్స్ మళ్ళీ రాజకీయాల్లో చర్చగా మారాయి..మొత్తానికి వర్మ పై బీజెపి చేసిన విమర్శల వల్ల దారికి వచ్చాడని అందరు అంటున్నారు.మరింత సమాచారం తెలుసుకోండి: