ఎన్టీయార్ ను నూరుశాతం తెలుగుదేశంపార్టీకి దూరం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి పెద్ద స్కెచ్చే వేస్తున్నట్లున్నారు. టీడీపీని పెట్టిందే ఎన్టీయార్ అయినప్పటికీ చంద్రబాబు+సంతానం, దగ్గుబాటి కలిసి పార్టీ నుండి ఎన్టీయార్ ను దూరంగా తరిమేశారు. అసలు పార్టీకి ఎన్టీయార్ కు సంబంధమే లేదని బహిరంగంగానే అప్పట్లో చంద్రబాబు ప్రకటించారు. అంతేకాకుండా ఇదే విషయాన్ని స్వయంగా కోర్టులో కూడా చెప్పారు.






దాంతో వేరేదారిలేక సీఎం పదవిపోయి, పార్టీ దూరమైపోవటంతో చివరకు ఎన్టీయార్ అన్న ఎన్టీయార్ అనే కొత్త పార్టీని పెట్టుకోవాల్సొచ్చింది. ఆ రకంగా పార్టీకి ఎన్టీయార్ ను సక్సెస్ ఫుల్లుగా చంద్రబాబు, సంతానం అంతా కలిసి దూరం చేసేశారు. ఇపుడు అదే అస్త్రాన్ని చంద్రబాబు మీదకు జగన్ ప్రయోగించాలని వ్యూహాలు రెడీ చేస్తున్నారు. పార్టీకి ఎన్టీయార్ కు సంబంధమే లేదని చెప్పిన  చంద్రబాబు ఎన్టీయార్ చనిపోయిన తర్వాత అవసరార్ధం మళ్ళీ అదే ఎన్టీయార్ ను మహానుభావుండంటు దండేసి దండం పెడుతున్నారు.





అయితే జగన్ మాత్రం విజయవాడ జిల్లాకు ఎన్టీయార్ పేరుపెట్టారు. ఇపుడు హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తీసేసినా తొందరలోనే ఎన్టీయార్ గౌరవం పెంచే పనిచేయబోతున్నారట. అదేమిటంటే ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారాన్ని అందించాలని కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపబోతున్నారట. నిజానికి ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం ఇప్పించాలని చంద్రబాబు ఏనాడూ అనుకోలేదు సరికదా అడ్డుకున్నారు.






చంద్రబాబు చేయకూడదని అనుకున్న పనిని జగన్ చేసి చూపించాలని డిసైడ్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. జగన్ ప్రతిపాదనలు వర్కవుటై కేంద్రం గనుక ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం ప్రకటిస్తే చంద్రబాబు పనైపోయినట్లే. ఇదే విషయాన్ని వచ్చే ఎన్నికల్లో జగన్ విస్తృతంగా ప్రచారం చేసుకుంటారు. ఎన్టీయార్ పైన చంద్రబాబుకు ప్రేముందా లేకపోతే జగన్ కుందా అనే చర్చ జనాల్లో తీసుకొస్తారు. ఎన్నికల సమయంలో ఎన్టీయార్ కు వారసులతో కలిసి చంద్రబాబు చేసిన ద్రోహమంతా మళ్ళీ ప్రచారంలోకి తెస్తారు. ఇదే సమయంలో ఎన్టీయార్ పేరును జిల్లాకు పెట్టడం, భారతరత్న పురస్కారం ప్రతిపాదనను వైసీపీ జనాలకు చెప్పుకుంటుంది. అప్పుడు జనాలు ఎటువైపు మొగ్గుచూపుతారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: