అమరావతి రాజధాని డిమాండుతో  పాదయాత్ర చేస్తున్న జేఏసీ నాయకుల వైఖరి చాలా విచిత్రంగా ఉంది. గుర్తింపుకార్డులున్న రైతులు లేదా స్ధానికులతో పాదయాత్ర మొదలుపెట్టకుండా కోర్టులో కేసు వేసి కాలక్షేపం చేస్తున్నారు. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండుతో  అమరావతి టు అరసవల్లి పేరుతో పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలోకి పాదయాత్ర ఎంటర్ కాగానే పోలీసులు గుర్తింపుకార్డులను వెరిఫై చేశారు.





ఎప్పుడైతే పోలీసులు గుర్తింపుకార్డుల వెరిఫికేషన్ మొదలుపెట్టారో యాత్రలో నుండి చాలామంది జంపైపోయారు. కారణం ఏమిటంటే అప్పటివరకు పాదయాత్రలో పాల్గొంటున్నది రైతులో లేకపోతే స్ధానికులో కాదుకాబట్టే. తమ బండారం ఎక్కడ బయటపడుతుందో అన్న ఆందోళనతో పెయిడ్ ఆర్టిస్టులంతా పారిపోయారు. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచక జేఏసీ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చింది. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన జేఏసీ నేతలు గుర్తింపుకార్డులున్న స్ధానికులు లేదా స్ధానిక రైతులను తీసుకుని మళ్ళీ పాదయాత్ర మొదలుపెడతారనే అనుకున్నారు.






అయితే జేఏసీ నేతలు మాత్రం ఆపనిచేయకుండా కోర్టులో కేసువేశారు. గుర్తింపుకార్డులు అడగకూడదని, పాదయాత్రలో ఎవరైనా పాల్గొనేందుకు, ఎంతమందైనా పాల్గొనేందుకు అనుమతించాలని పిటీషన్లో అడిగారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు బుధవారం కేసును కొట్టేసింది. సింగిల్ జడ్జి విధించిన షరతులకు లోబడే పాదయాత్ర జరగాలని తేల్చిచెప్పేసింది. ఇక్కడే జేఏసీ నేతల వైఖరిపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.





పాదయాత్ర చేసేందుకు గుర్తింపుకార్డులున్న 600 మంది 29 గ్రామాల్లో జేఏసీ నేతలకు దొరకటమే లేదా ? వేలమంది జనాలున్న రాజధాని గ్రామాల్లో పాదయాత్ర చేసేందుకు మనుషులు దొరకటంలేదంటే ఆశ్చర్యంగానే ఉంది.  జేఏసీ నేతల వైఖరి చూస్తుంటే మంత్రులు, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా పాదయాత్రంతా బోగస్సేనా ? ఇంతకాలం ఆందోళనలు చేసింది, పాదయాత్రలో పాల్గొన్నదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు, టీడీపీ నేతలేనా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లేకపోతే అమరావతి సెంటిమెంటు లోకల్ జనాల్లోనే లేదా ?

మరింత సమాచారం తెలుసుకోండి: