తెలుగుదేశంపార్టీతో  పొత్తు పెట్టుకునే విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చూపిస్తున్న చొరవను చంద్రబాబునాయుడు చూపటంలేదు. వచ్చేఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు పవన్ ప్రకటించి ఆరురోజులవుతున్నా చంద్రబాబు వైపునుండి ఓపెన్ గా ఎలాంటి సానుకూలతా కనబడలేదు. సానుకూలత కనబడకపోగా రివర్సులో ఒక ప్రకటన చేశారు. మీడియాతో మాట్లాడుతు చంద్రబాబు ఏమన్నారంటే రాబోయే ఎన్నికల్లో 175కి 175 సీట్లూ తెలుగుదేశంపార్టీ గెలుచుకోవాలన్నారు.

175కి 175 సీట్లు గెలవటం అన్నది జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న టార్గెట్ అని అందరికీ తెలిసిందే. చివరకు చంద్రబాబు వైసీపీ అధినేత పెట్టుకున్న టార్గెట్ ను కూడా కాపీ కొట్టేస్ధాయికి దిగజారిపోయారు. సరే చంద్రబాబు పెట్టుకున్న టార్గెట్ రీచవుతారా లేదా అన్నది వేరే విషయం. ఇక్కడ గమనించాల్సిందేమంటే 175కి 175 సీట్లూ టీడీపీనే గెలవాలంటే మరి పొత్తు ఖాయమని ప్రచారంలో ఉన్న జనసేన మాటేమిటి ? పొత్తులో జనసేనకు ఎన్నోకొన్ని సీట్లయితే కేటాయించాలి కదా.


కేటాయించిన సీట్లు పోగా టీడీపీ ఎన్నింటిలో పోటీచేస్తుంది ? ఎన్ని గెలుస్తుందనేది కీలకంగా మారుతుంది. మరి ఈ నేపధ్యంలో 175 సీట్లలోనూ టీడీపీనే గెలవాలని చంద్రబాబు చెప్పటంలో అర్ధమేంటి ? పొత్తు విషయంలో పవన్ స్పందించనంత వరకు చంద్రబాబు వన్ సైడుగా లవ్ లెటర్లు రాశారు. తాను రాసిన లెటర్లకు పవన్ స్పందించటంలేదని కుప్పంలోనే బహిరంగంగా చంద్రబాబు తెగఫీలైపోయారు.

తీరా చంద్రబాబు లెటర్ కు పవన్ ఓకే చెప్పిన తర్వాత ఇపుడు చంద్రబాబు వెనకాడుతున్నారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏమి జరుగుతోందో జనాలకు అర్ధంకావటంలేదు. చంద్రబాబు ముందుకొస్తే పవన్ వెనక్కు వెళతారు. పవన్ ముందుకొచ్చినపుడు చంద్రబాబు మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. బహుశా వీళ్ళిద్దరు కలిసి గేమ్ ఏదైనా ప్లే చేస్తున్నారేమో అనిపిస్తోంది. లేకపోతే ఇలాగే ఆటలు ఆడి ఆడి చివరకు పవన్ను చంద్రబాబు పిచ్చోడ్ని చేసేస్తారా ? చంద్రబాబు ట్రాక్ రికార్డు కారణంగా అనుమానాలు రావటంలో తప్పేలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: