వివేకానందరెడ్డి మర్డర్ కేసు దర్యాప్తు విషయంలో సుప్రింకోర్టు బాగా సీరియస్ అయ్యింది. దర్యాప్తు మొదలుపెట్టి నాలుగేళ్ళయినా ఇంతవరకు దర్యాప్తు పూర్తిచేయలేకపోవటం ఏమిటంటు మండిపడింది. దర్యాప్తు ఏ దశలో ఉందో వెంటనే తమకు ఒక సీల్డ్ కవర్లో తెలియజేయాలని సీబీఐని ఆదేశించింది. అలాగే దర్యాప్తు అధికారిని ఎందుకు మార్చకూడదో చెప్పాలంటు సీబీఐ డైరెక్టరును ఆదేశించింది. ఈ కేసులో నిందుతులు, అనుమానితులతో పాటు దర్యాప్తు అధికారుల బృందంలోని కొందరి వైఖరిపైన కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి.





దర్యాప్తు అధికారుల్లో కొందరు ఇప్పటికే అరెస్టయిన వారిపై వచ్చిన ఆరోపణలమీద మాత్రమే దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకరరెడ్డి భార్య తులశమ్మ ఆరోపణలను మాత్రం పట్టించుకోవటంలేదు. మర్డర్ కేసులో అప్రూవర్ గా మారిన ఏ 4 దస్తగిరి ఆరోపణల ప్రకారమే విచారణ చేస్తున్నారంటు ఎంపీ, ఆయన తండ్రి పదేపదే ఆరోపిస్తున్నారు. దస్తగిరి అండ్ కో చెప్పినట్లు సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ తదితరులు ఆడుతున్నట్లు ఎంపీ అండ్ కో ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.





దస్తగిరి అండ్ కో ఎంపీ తదితరులపై ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో తులశమ్మేమో వివేకా కుటుంబసభ్యులపైన అనుమానాలు వ్యక్తంచేశారు. తన అనుమానాలకు తగ్గట్లు కొన్ని ఆధారాలను కోర్టుముందుంచారు. అయినా సీబీఐ వాటిని పరిగణలోకి తీసుకోలేదు. అందుకనే కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగటంలేదని నానా గోల జరుగుతోంది. ఎంపీ, తులశమ్మ ఆరోపణలను సీబీఐ ఎందుకు పరిగణలోకి తీసుకోవటంలేదో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇదే విషయాన్ని తులశమ్మ లాయర్ సుప్రింకోర్టులో చెప్పారు.





ఇలాంటి వివాదాల కారణంగానే కేసు దర్యాప్తులో వేగం కనబడటంలేదు. ఈ విషయంపైనే సుప్రింకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకవేళ అధికారులను మారిస్తే కేసు దర్యాప్తు మళ్ళీ మొదటికి వచ్చే అవకాశముంది. నాలుగేళ్ళుగా దర్యాప్తు పూర్తికాలేదని ఆగ్రహం వ్యక్తంచేసినపుడు కొత్త అధికారిని నియమిస్తే ఇంకెతం కాలం పడుతుందో. రెండువైపులా వినబడుతున్న ఆరోపణల ఆధారంగా అనుమానితులందరినీ విచారిస్తే సమస్యే ఉండదు. కానీ దర్యాప్తు మొత్తం కొందరిచుట్టూ మాత్రమే తిరుగుతుంటే విచారణ ఎప్పటికీ పూర్తికాదని అర్ధమవుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: