ఇపుడీ విషయమే రాష్ట్ర రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ అయిపోయింది. మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ ప్రచారం బాగా జోరుగా సాగుతోంది. జేపీగా పాపులరైన లోక్ సత్తా వ్యవస్ధాపక కన్వీనర్ జయ్ ప్రకాష్ నారాయణ తొందరలోనే వైసీపీలో చేరబోతున్నారట. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా బెజవాడ లోక్ సభకు పోటీచేయబోతున్నారనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. రాజకీయాల్లో ఎప్పుడేమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు. పైగా ఇప్పటి స్పీడు రాజకీయాల్లో ఏ నేత ఏ పార్టీలో ఎన్నిరోజులుంటారో కూడా ఎవరు చెప్పలేకున్నారు.
నిజానికి జేపీ ఆలోచనలే ప్రత్యేకంగా ఉంటాయి. జనాలకు సరికొత్త రాజకీయాన్ని పరిచయం చేసే ఉద్దేశ్యంతోనే లోక్ సత్తాను ఏర్పాటుచేశారు. అప్పటికే ఉన్న పార్టీల్లో చేరితే పెద్ద పదువులు దక్కేవేమో కానీ తాను అనుకున్న రాజకీయాలు చేయటం సాధ్యంకాదు. అందుకనే కొత్తగా లోక్ సత్తాను ఏర్పాటుచేశారు. ఐఏఎస్ అధికారిగా పనిచేసిన జేపీకి జనాల్లో ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల్లో మంచి గుర్తింపుంది. ఏ విషయంమీదైనా నిర్మొహమాటంగా అభిప్రాయాలను చెబుతారు. టీవీ డిబేట్లలో కూడా తాను అనుకున్నది అనుకున్నట్లు జనాలకు కన్వేచేయటంలో జేపీది ప్రత్యేక శైలనే చెప్పాలి.
ఇలాంటి జేపీ తొందరలోనే వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం ఆశ్చర్యంగానే ఉంది. నిజానికి జేపీ-జగన్మోహన్ రెడ్డి వైవహార శైలికి ఏమాత్రం పడదనే అనుకోవాలి. కాకపోతే జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న నాడు-నేడు, విలేజ్ క్లినిక్కులు, గడపగడపకు వైసీపీ కార్యక్రమాలను జేపీ బాగా అభినందించారు. పిల్లలకు బైజూస్ ద్వారా కంటెంటును అందించిన ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.
కొన్ని అంశాల్లో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన జేపీని జగన్ ఈమధ్యనే జరిగిన ఆప్కాబ్ కార్యక్రమంలో కలిశారు. వేదిక మీదున్న జగన్ కింద కూర్చున్న జేపీని ప్రత్యేకంగా పిలిపించుకుని తన పక్కనే కూర్చోబెట్టుకుని మాట్లాడారు. దాంతో ఒక్కసారిగా జేపీ వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం పెరిగిపోయింది. ఏమో రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం అనే ప్రాతిపదకన జేపీ వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం ఆధారపడుంది. నిజంగానే జేపీ గనుక వైసీపీలో చేరి విజయవాడ లోక్ సభకు పోటీచేస్తే పార్టీకి ప్లస్ అవుతుందనే అనుకోవాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి