రాబోయే ఎన్నికలకు సంబంధించి అన్నీపార్టీలు గెలుపు గుర్రాలను రెడీ చేసుకుంటున్నాయి. ఇందుకు అవసరమైన సర్వేలు చేయించుకుంటు రిపోర్టులు తెప్పించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతినెలా సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. వచ్చేఎన్నికల్లో పోటీచేయటానికి ఎంఎల్ఏల జాబితాపై జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటి జాబితాను విడుదల చేయటానికి రెడీ అయ్యారట. దసరా పండుగ సందర్భంగా మొదటిజాబితాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట.
సుమారు 30 మందితో మొదటిజాబితా ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం. ఈ జాబితాలో కొత్తముఖాలకు ఎక్కువ అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇందులో కూడా టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతోందట. ఇపుడు అక్కడకక్కడ కొందరు అభ్యర్ధులను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటిస్తున్నారు. ఈమధ్యనే విజయవాడ నగరంలోని ముగ్గురు అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక రెండో జాబితాను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయటానికి రెడీ అవుతున్నారట. ఇందులో సుమారు 100 నియోజకవర్గాలుంటాయని చెబుతున్నారు. ఈ జాబితాలో ఎక్కువగా సిట్టింగుల నియోజకవర్గాలుంటాయట. సుమారు 30 మంది సిట్టింగులకు టికెట్లు దక్కే అవకాశాలు లేవనే ప్రచారం అందరికీ తెలిసిందే. గడపగడపకు వైసీపీ వర్క్ షాపు నివేదిక ప్రకారమైతే 18 మంది ఎంఎల్ఏల పనితీరు మీద జగన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఈ 18 మందికి మళ్ళీ టికెట్లు డౌటనే అంటున్నారు.
వీళ్ళు కాకుండా ఆరోపణలను ఎదుర్కొంటున్నవాళ్ళు, పనితీరును మెరుగుపరుచుకోని వాళ్ళు మరో 15 మంది ఉంటారని సమాచారం. ఇక మూడోజాబితాలో సమస్యాత్మక నియోజకవర్గాలుంటాయాట. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరాటం జరుగుతున్నది. ఏదేమైనా అభ్యర్ధుల జాబితాలను ముందుగానే ప్రకటించటం వల్ల సమస్యలను పరిష్కరించుకునేందుకు తగిన సమయం ఉంటుందని జగన్ అనుకుంటున్నారట. పోయిన ఎన్నికల్లో కూడా చాలావరకు అభ్యర్ధులను ఇలాగే ప్రకటించారు. కాబట్టి రాబోయే ఎన్నికలకు కూడా ఇదే పద్దతిని అనుసరించబోతున్నారు. పైగా వైనాట్ 175 అనే టార్గెట్ పెట్టుకున్నారు కదా. అందుకనే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి