
అరెస్టయి రిమాండులో ఉన్నది చంద్రబాబునాయుడు అయితే ఎల్లోమీడియాకు మైండ్ దెబ్బతిన్నట్లుంది. జైలులో ఉన్న చంద్రబాబు ఎలాగున్నారో తెలీదు కానీ బయటున్న ఎల్లోమీడియా యాజమాన్యాలు, వాళ్ళ ప్రతినిధులు మాత్రం గంగవెర్రిపోతున్నారు. దీనికి తాజా ఉదాహరణ ఏమిటంటే ఎల్లోమీడియాలోని ఒక ఛానల్ ప్రతినిధి రాజమండ్రి జైలు ముందు నుండి రిపోర్టింగు చేస్తు అనేక అనుమానాలను రేకెత్తించారు. అవేమిటంటే జైలులో చంద్రబాబు ఉన్న గదిలోకి దోమలను ప్రభుత్వమే కావాలని తీసుకొచ్చి వదులుతోందని.
వినటానికి ఆశ్చర్యంగానే ఉన్నా రిపోర్టర్ చెప్పింది మాత్రం ఇదే. సదరు రిపోర్టర్ లైవ్ లో చెప్పిందనికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇప్పటివరకు కుక్కలను, పందులను పట్టుకోవటం గురించి జనాలందరు వినే ఉంటారు కానీ ఈ రిపోర్టర్ మాత్రం దోమలను పట్టుకొచ్చి చంద్రబాబున్న గదిలోకి ప్రభుత్వం వదిలిందేమో అన్నఅనుమానాన్ని వ్యక్తంచేశారు. దోమలను తరిమేసేందుకు నార్మల్ గా కాయిల్స్ ను పెడతారట. కానీ చంద్రబాబు గదిలో మాత్రం ఏమీ పెట్టకుండా దోమలొచ్చేట్లు ఏర్పాటు చేశారట.
చంద్రబాబున్న గదిలోకి దోమల న్యాచురల్ గా వచ్చాయా ? లేకపోతే దోమలు వచ్చేట్లు చేశారా ? లేకపోతే దోమలను పట్టుకొచ్చి గదిలో వేశారా అన్న అనుమానాలు అందరిలోను పెరిగిపోతోందట. సౌకర్యాలు కల్పించాల్సిన చంద్రబాబుకు అసౌకర్యం కల్పించటం అంటే దీనివెనుక దోమలతో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమన్నా ఉందా అనే అనుమానాలు లేకపోలేదని సదరు రిపోర్టర్ చెప్పారు. దోమలను వదలటం ద్వారా స్లో పాయిజనింగ్ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నట్లుగా చెప్పారు. నిజంగా ఆ రిపోర్టర్ కు మాయాబజార్ సినిమాలో చెప్పినట్లుగా రెండు కాదు నాలుగు వీరతాళ్ళు వేయాల్సిందే.
ఎందుకంటే దోమలు కుట్టకుండా తన గదిలో జైలు అధికారులు దోమతెర ఏర్పాటు చేశారని చంద్రబాబు తనతో చెప్పినట్లు యనమల రామకృష్ణుడు మీడియాతో చెప్పారు. మరి యనమల చెప్పింది కరెక్టా లేకెపోతే రిపోర్టర్ చెప్పింది కరెక్టా ? అయినా చంద్రబాబు ఉన్నది జైలులోనే కానీ 7 స్టార్ హోటల్లో కాదని మరచిపోతున్నారు. జైలు గదులంటే ఇలాగే ఉంటాయని చంద్రబాబు, యనమలకు తెలీదా ? మొన్నటివరకు అధికారంలో ఉన్నది వీళ్ళే కదా. జైళ్ళల్లో సౌకర్యాల కల్పనకోసం ఆలోచించి చర్యలు తీసుకునుంటే ఇప్పుడింత గోల చేయాల్సిన అవసరం ఉండేదికాదేమో ?