బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు ఒక మాటన్నారు. అదేమిటంటే విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగదట. ప్రైవేటీకరణ కనీసం ఇప్పట్లో జరగదని గట్టిగానే ప్రకటించారు. వైజాగ్ లో మాట్లాడుతు స్టీల్ ప్లాంట్ ను లాభాల్లో నడిపించాలన్నదే కేంద్రప్రభుత్వం ఆలోచనగా చెప్పారు. ప్లాంటుకు అవసరమైన ఐరన్ ఓర్ కోసం గత ప్రభుత్వాలు ప్రయత్నించలేదట. ప్లాంటును యాజమాన్యం కూడా పట్టించుకోలేదన్నారు. ప్లాంటులో గతంలో జరిగిన తప్పిదాలకు నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని నిందించటం సరికాదన్నారు.





ఇక్కడ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో వైజాగ్ పార్లమెంటు నుండి జీవీఎల్ పోటీచేయాలని అనుకుంటున్నారు. క్షేత్రస్ధాయిలో బీజేపీకి అన్నీవిధాలుగా తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. మామూలుగా అయితే జీవీఎల్ కు డిపాజిట్ దక్కేది కూడా అనుమానమే. అందుకనే స్టీల్ ప్లాంటు డ్రామాలు మొదలుపెట్టారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ జరగదని జీవీఎల్ కాదు చెప్పాల్సింది నరేంద్రమోడీ మాత్రమే. ఎందుకంటే మోడీ మండిపోతున్న జనాలు  జీవీఎల్ మాటను ఎవరు నమ్ముతారు ?




గతంలో స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయటం ఖాయమని కేంద్రమంత్రులు పార్లమెంటులోనే ప్రకటించారు. కాబట్టి జీవీఎల్ చెప్పే మాటలు కేవలం రాబోయే ఎన్నికల్లో ఓట్లకోసమే అని అనుమానాలు పెరిగిపోతున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నుండి కేంద్రం వెనక్కుతగ్గితే అంతా సంతోషిస్తారు. అయితే ఆ ప్రకటన రావాల్సింది కేంద్రప్రభుత్వం నుండే తప్ప ఎంపీ నుండి కాదు. అందుకనే జీవీఎల్ మాటలను ఎవరు నమ్మటంలేదు. ముడిసరుకు కోసం రాష్ట్రప్రభుత్వం ఎంత ప్రయత్నించినా కేంద్రం స్పందించలేదు. ప్లాంటును యాజమాన్యం పట్టించుకోలేదని చెప్పటం కూడా అబద్ధమే.





రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ కొత్త డ్రామాకు తెరలేపినట్లుగా అనుమానాలు పెరిగిపోతున్నాయి. పోయిన ఎన్నికల్లో వైజాగ్ నుండి బీజేపీ తరపున దగ్గుబాటి పురందేశ్వరి పోటీచేస్తే డిపాజిట్ కూడా రాలేదు. అలాంటిది రాబోయే ఎన్నికల్లో వైజాగ్ లో పోటీచేసే ఉద్దేశ్యంతోనే జీవీఎల్ రెగ్యులర్ గా సిటిలో పర్యటిస్తున్నారు. విభజన హామీలను తుంగలో తొక్కేస్తున్న కారణంగా మోడీ ప్రభుత్వంపై జనాలంతా మండిపోతున్నారు. ఇది గమనించిన తర్వాతే జీవీఎల్ ఏదో కొత్త డ్రామా మొదలుపెట్టారు. మరి జీవీఎల్ ఎన్నికల భవిష్యత్తు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: