మరి కొద్దీ నెలలో మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మొదలు కాబోతున్నాయి. ఈ ఎన్నికలలో ఎంతో మంది పోటీ చేస్తారు. సమాజానికి తమవంతు సేవ చెయ్యాలనే ఉద్దేశం ఉన్న ప్రతిఒక్కరు ఎన్నికలలో పోటీ చెయ్యవచు. ఐతే పోటీ చెయ్యాలి అనే ఆలోచన ఉన్నప్పటికీ, పోటీ చెయ్యటానికి పాటించవలసిన నియమాలు, ప్రభుత్వానికి సబ్మిట్ చెయ్యవలసిన పత్రాలు ఏమిటి, అర్హతలేమిటి అన్న అనుమానాలు, ఆలోచనల వలన వెనకడుగు వేస్తుంటారు. అందుకే ఎన్నికలలో పాల్గొనటానికి కావలసిన అర్హతలు, పత్రాల సమాచారం, మీకోసం.

సాధారణంగా ఎన్నికలలో పోటీ చేసేందుకు కావలసిన ప్రధమ అర్హత పౌరసత్వం. పోటీ చేసే ప్రతి వ్యక్తి భారతదేశ పౌరుడై ఉండాలి. అదేవిధంగా ఆ వ్యక్తి పేరు ఓటరు జాబితాలో ఉండాలి. ఐతే వారి పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గం ఓటరు జాబితాలో ఉండవలసిన అవసరం లేదు. ఓటు వేసేది ఎక్కడైనా సరే, తమకు నచ్చిన ప్రదేశం నుంచి పోటీ చెయ్యవచు. ఇక వయసు విషయానికొస్తే పోటీ చేసే అభ్యర్థి వయసు 25 ఏళ్ళు పైబడి ఉండాలి. అంతే కాకుండా, వ్యక్తి మానసికంగా పూర్తి ఆరోగ్యం కలిగి ఉండాలి. ఇక పత్రాల విషయానికొస్తే, అభ్యర్థి తన గుర్తింపు, చిరునామా, ఆస్తిపాస్తులు, కోర్ట్ కేసులు కి సంబంధించిన పూర్తి వివరాలను ఎన్నికల కమిషన్ కు సమర్పించవలసి ఉంటుంది. వీటితో పాటు, ఇంటి పన్ను, అన్ని పన్నుల రసీదులు సమర్పించవలసి ఉంటుంది. ఏదయినా పార్టీ తరుపున పోటీ చేస్తే, గుర్తు కేటాయింపు ధ్రువీకరణ పత్రాన్ని కూడా సమర్పించాలి.

పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు, ఓటు వేయబోయే ఓటర్ల మనసులో కూడా వచ్చే సందేహం, ఒక అభ్యర్థి ఎన్ని ప్రదేశాల నుంచి పోటీ చెయ్యవచు అని. 1996 వ సంవత్సరం వరకు, ఒక వ్యక్తి ఎన్ని ప్రదేశాల నుంచి అయినా సరే పోటీ చేసే అవకాశం ఉండేది. కానీ 1996 ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించింది. ప్రస్తుతం ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 33(7)
ప్రకారం ఒక వ్యక్తి కేవలం రెండు ప్రదేశాల నుంచి మాత్రమే పోటీ చెయ్యగలడు. ఒకే వ్యక్తి, తానూ పోటీ చేసిన రెండు ప్రదేశాల నుంచి విజయం సాధించినట్లయితే, వారు ఫలితాలు వచ్చిన 10 రోజులలో ఒక స్థానాన్ని వదులుకోవలసి ఉంటుంది. ఆ తరువాత ఆ ఖాళి అయినా సీటుకి మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: