తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్దం అయ్యింది. ఈరోజు (30 నవంబర్) గురువారం పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రవాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న ప్రజలు ఓటుహక్కును వినియోగించుకోవడం కోసం సోంత ప్రాంతాలకుతరలి వెళ్లారు.ఇక సామాన్యులతో పాటు..సెలబ్రిటీలు కూడా ఓటు వేసుందుకురెడీ అయ్యారు. మరి చిరు, చరణ్, ఎన్టీఆర్ ప్రభాస్, నాగార్జున, మహేష్ వీరంతా ఎక్కడ ఓటు వేయబోతున్నారో తెలుసా..? తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సామాన్యులతో పాటు చాలా మంది సినీతారలు కూడా రెడీ అయ్యారు. కొంత మంది బయట ఎక్కడెక్కడో షూటింగ్స్ లో ఉన్నా కాని.. ఓటువేసేందుకు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. అది సరే మరి సినీ తారలు హైదరాబాద్ లో ఎవరెవరు ఏ ఏ పోలీంగ్ బూత్ లో ఓటు వేయనున్నారంటే..?

 మెగాస్టార్ చిరంజీవి.. ఆయన ఫ్యామిలీ అంతా.. జూబిలీహిల్స్‌ క్లబ్‌లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. చిరంజీవి సహా ఆయన సతీమణి సురేఖ, కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ తో పాటు.. చరణ్ సతీమణి ఉపాసన, హీరో నితిన్‌ కూడా ఇదే పోలింగ్ బూత్ లో ఓటేయనున్నారు. అంతే కాదు మైసూర్ లో జరుగుతున్న గేమ్‌ చేంజర్‌ షూటింగ్ నుంచి ఓటు వేసేందుకు హైదరాబాద్‌ వచ్చారు రామ్ చరణ్.ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ తో పాటు అనుష్క , వెంకటేశ్‌, బ్రహ్మానందం మణికొండలోని పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. రవితేజ మాత్రం ఎంపి, ఎమ్యెల్యే కాలనీలోని కేంద్రంలో ఓటు వేయబోతున్నారు. మరో టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్‌ జూబిలీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 4లోని ఆర్థిక సహకార సంస్థలో ఓటేయబోతున్నారు.జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ పోలింగ్‌ బూత్‌ 165 లో మహేశ్‌బాబు, నమ్రత తో పాటు.. మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌ ఓటు హక్కును వినినమోగించుకోబోతున్నారు.

 యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ సతీసమేతంగా ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూలులో ఓటు వేయబోతున్నారు. ఇక విజయ్ దేవరకొండత తన ఫ్యామిలీతో పాటు జూబిలీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఓటు హక్కును వినిపియోగించుకోబోతున్నట్టు తెలుస్తోంది. హీరో విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండతో పాటు.. హీరో శ్రీకాంత్‌ కూడా అక్కడే ఓటు వేయబోతున్నారు.ఇక స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. ఆయన సతీమణి రమా రాజమౌళి కలిసి షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఓటు వేయబోతున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌ తోపాటు..అల్లు ఫ్యామిలీ అంతా ఓటు హక్కును వనిపియోగించనున్నారు.

 వర్కింగ్‌ వుమెన్స్‌ హాస్టల్‌లో అక్కినేని నాగార్జునతో పాటు ఆయన ఫ్యామిలీ ఓటు వేయబోతున్నారు. నాగార్జున సతీమణి అమల, ఆయన కుమారుడు నాగచైతన్య , చిన్న కుమారుడు అఖిల్‌ ఓటేస్తారు. ఇక ఎఫ్‌ఎన్‌సిసిలో సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌, దగ్గుబాటి రానా , సురేష్‌ బాబు, విశ్వక్‌ సేన్‌ తో పాటు మరికోందరు స్టార్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.ఈరోజు (గురువారం) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు జరిగాయి. 35 వేల 655 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 45 వేల మందికి పైగా పోలీసులు ఎన్నికల బందోబస్తులో ఉన్నారు. 375 కేంద్ర బలగాలు ఎన్నికల పర్యవేక్షణలో ఉన్నాయి. డిసెంబర్‌ 3వ తేదీన తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: