ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు నిలబడ్డారు అన్న విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న టిఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్కు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. ఏకంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు అయినప్పటికీ.. కాంగ్రెస్ మాత్రం ఏకంగా మరో నాలుగు సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారో అనే ఉత్కంఠ  నెలకొనగా.. ఇదే విషయంపై ఇటీవల క్లారిటీ వచ్చింది.


 కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈనెల ఏడవ తేదీన రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటి మినిస్టర్ గా ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఐటి మినిస్టర్ గా కేటీఆర్ ఎంతో సమర్థవంతంగా పనిచేశారు. అంతేకాదు ఇప్పటివరకు ఏ ఐటి మినిస్టర్ కూడా ఆయనలాగా పనిచేయలేదు అన్న విధంగా అభివృద్ధిని చేసి చూపించారు.


 మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఐటి మినిస్టర్ గా ఎవరు రాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ రావుకు మంత్రిమండలిలో ఛాన్స్ వస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనకు ఐటి మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉందట. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆయనకు వివిధ నగరాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఐటీ రంగంలో ఆయనకు విశేష అనుభవం ఉండడంతో చివరికి ఐటీ శాఖ మంత్రిగా ఆయననే నియమించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అలాగే మదన్ మోహన్ రావుకు అటు జాతీయ నేతలతో కూడా ఎంతో మంచి సంబంధాలు ఉండడంతో ఆయనకే ఐటి మినిస్టర్ పదవి వరిస్తుంది అని టాక్ ఉంది ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: