కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో ప్రకటించిన సిక్స్ గ్యారెంటీస్ హామీ చాలా కీలకపాత్ర పోషించిందనే విశ్లేషణలు అందరికీ తెలిసిందే. ప్రచారం మొత్తంమీద కాంగ్రెస్ అభ్యర్ధులు, నేతలు సిక్స్ గ్యాంరెటీస్ మీదే ఎక్కువగా దృష్టిపెట్టారు. అలాంటిదే ఇపుడు మరో సిక్స్ నెంబర్ మీద పార్టీలో చర్చలు పెరిగిపోతున్నాయి. సిక్స్ గ్యాంరెటీస్ తో అధికారంలోకి వచ్చిన పార్టీలో లక్కీ సిక్స్ ఎవరనే చర్చ పెరిగిపోతోంది. ఇంతకీ ఈ లక్కీ సిక్స్ ఏమిటంటే భర్తీ  అవ్వబోయే ఎంఎల్సీల సంఖ్య.





గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన ఎంఎల్సీ స్ధానాల్లో ఇప్పటికే రెండు స్ధానాలు ఖాళీగా ఉన్నాయి. కేసీయార్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్రాసత్యనారాయణలను ఎంఎల్సీలుగా చేసిన ప్రతిపాదన గవర్నర్ దగ్గరే పెండింగులో ఉంది. అంటే గవర్నర్ కోటాలో రెండు స్ధానాల భర్తీకి రెడీగా ఉన్నాయి. అలాగే లోకల్ బాడీ, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల నుండి గెలిచిన ఇద్దరు ఎంఎల్సీలు తాజా ఎన్నికల్లో ఎంఎల్ఏలుగా గెలిచారు. అలాగే ఎంఎల్ఏల కోటాలో ఎంఎల్సీలు అయిన మరో ఇద్దరు కూడా ఇపుడు ఎంఎల్ఏగా గెలిచారు.





అంటే మొత్తంమీద ఆరు ఎంఎల్సీ స్ధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయాల్సుంటుంది. లోకల్ బాడీస్ తరపున ఎంఎల్సీ అయిన కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్టభద్రుల కోటాలో ఎంఎల్సీ అయిన పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంఎల్ఏల కోటాలో ఎంఎల్సీలు అయిన కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి తొందరలోనే ఎంఎల్సీలుగా రాజీనామాలు చేయటం ఖాయం. గ్రాడ్యుయేట్ , లోకల్ బాడీ , ఎంఎల్ఏ కోటా ఎన్నికలు నిర్వహించాలంటే కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిపికేషన్ జారీ చేయాల్సిందే. అప్పుడు ఎంఎల్సీల లెక్కలపై ఎల్లా హోటల్లో హస్తంపార్టీ నేతలు ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారట.





అయితే గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు స్ధానాలకు ఎన్నికల కమీషన్ ఎప్పుడో నోటిఫికేషన్  ఇచ్చుంది. మరా  నోటిఫికేషన్ కు కాలపరిమితి ఉందా లేకపోతే ఎప్పుడైనా భర్తీ చేయచ్చా అనే విషయమై ప్రభుత్వం క్లారిటి తీసుకోవాలి. ఎప్పుడైనా భర్తీ చేయచ్చంటే గవర్నర్ కోటాలో రెండు స్ధానాలను వెంటనే భర్తీ చేసే అవకాముంది. మిగిలిన నలుగురు ఎంఎల్సీలుగా రాజీనామాలు చేయగానే ఎన్నికల కమీషన్  నోటిఫికేషన్ జారీచేయటం ఖాయం. కాబట్టి తొందరలోనే ఎంఎల్సీలు అవబోయే ఆ లక్కీ సిక్స్ ఎవరో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: