ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు రోజురోజుకీ వేడి పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఒకరు షర్టు మడత పెట్టేందుకు సిద్ధమా అంటుంటే మరొకరి కుర్చీ మడత పెట్టేందుకు సిద్ధమంటూ కూడా తెలుపుతున్నారు. ఇలా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఒక మాటల యుద్ధమే జరుగుతోంది .రాజకీయాలలో ఎన్నికల సమయం లేకపోవడంతో అటు వైసిపి, టిడిపి ,జనసేన, కాంగ్రెస్ ఇతర పార్టీల ప్రచారాలు కూడా మరింత వేగవంతంగా చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రచారంలోని భాగంగానే నువ్వా నేనా అనేట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు భారీగానే హామీలను ప్రకటిస్తూ నిన్న మొన్నటి వరకు టిడిపి పలు రకాల సభలను కూడా ఏర్పరిచింది. సిద్ధం సభతో వైసిపి క్యాడర్ మొదలుపెట్టడంతో అప్పటినుంచి టిడిపి హవా తగ్గిపోయింది.



ఇటీవలే రాయలసీమలోని రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి.. షర్టు స్లీవ్ లెస్ మడత పెట్టాల్సిన సమయం వచ్చిందని టిడిపిని మరొకసారి మడత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలంటూ కూడా వ్యాఖ్యానించారు.. అయితే ఈసారి ఏపీ సీఎం ప్రసంగాన్ని గమనిస్తే కాస్త డైలాగుల డోర్స్ మరింత ఎక్కువ పెంచినట్టుగానే తెలుస్తోంది.. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న యుద్ధం వంటిది అంటూనే టిడిపిని మరొకసారి మడత పెట్టడం గ్యారెంటీ అంటూ పంచల వర్షంతో కురిపించారు ఏపీ సీఎం.


దీంతో చంద్రబాబుకు కాస్త గట్టిగానే తగలడంతో నువ్వు రాజకీయాల ముందు పిల్ల బచ్చావి తన రాజకీయం దెబ్బకు మీ నాన్నే భయపడేవారు అంటూ జగన్మోహన్ రెడ్డి పైన పంచుల వర్షాన్ని కురిపించారు. అలా పొలిటికల్ పంచులతో చంద్రబాబు కూడా రెచ్చిపోయారు. ఇలా సినిమా డైలాగులను తలపించేలా ఒకరిపై ఒకరు పంచులు వేసుకోవడంతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తంగా మారుతున్నాయి. మరి ఈసారి ఎన్నికలలో ఎవరు ఎవరు కుర్చీని మడత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు తెలియాలి అంటే మరొక కొన్ని నెలలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: