చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పార్టీల మధ్య ఎట్టకేలకు పొత్తు కుదిరి కూటమిని ప్రకటిస్తూ సీట్ల పంపకాలు కూడా తెలియజేశారు.. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లతో పాటు మూడు పార్లమెంటు సీట్లు కూడా టిడిపి పార్టీ కేటాయించింది.. టిడిపి అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన తర్వాత ఒక్కసారిగా జనసేన పార్టీ సైనికుల సైతం కలవరం మొదలయ్యింది. కొంతమంది ఈ సీట్ల పంపకాన్ని సమర్థిస్తూనే మరి కొంతమంది తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.. జనసేన పార్టీకి చాలా తక్కువ సీట్లు ఇచ్చారని ఇది అవమానకరంగా ఉందంటూ కూడా చాలామంది వాదిస్తున్నారు.


ఇప్పుడు ఈ వాదనకు మరింత తెర మీదకి వచ్చేలా కనిపిస్తోంది. జనసేన పార్టీ బలహీనంగా ఉన్న సీట్లను టిడిపి కేటాయించడం జరుగుతోందని పవన్ కళ్యాణ్ ను నాదెండ్ల మనోహర్ మోసం చేశారా.. లేకపోతే చంద్రబాబు మోసం చేశారా అనే వాదనలు రోజురోజుకి వినిపిస్తున్నాయి. చంద్రబాబు కేటాయించిన సీట్లను పవన్ కళ్యాణ్ పరిశీలించలేదా కేవలం నాదెండ్ల మనోహర్ పైన నమ్మకంతోనే గుడ్డిగా వీటిని ఓకే చేస్తున్నారా అనే వార్తలు వినిపిస్తున్నాయి.. జనసేన పార్టీ గత ఎన్నికలలో చాలా బలహీనంగా కనపరిచింది..


అనకాపల్లిలో జనసేనకు 11,988 ఓట్లు మాత్రమే రాగా ఇప్పుడు అక్కడి నుంచి రామకృష్ణను పవన్ కళ్యాణ్ దింపబోతున్నారు.. దీంతో అనకాపల్లి నుంచి నాగబాబును పోటీ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. గన్నవరం సీటులో జనసేన పార్టీ 36,759 ఓట్లు సాధించుకోగ ఇప్పుడు ఈ సీట్ ని టిడిపికే ఇచ్చేశారు.. జనసేన పైన చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్ కు ఈ టికెట్ ఇవ్వడంతో చాలామంది జనసైనికులు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అలా చాలా చోట్ల బలం ఉన్నచోట జనసేన నాయకులను కాకుండా టిడిపి పోటీ చేస్తూ ఉండడంతో జనసైనికులు ఈ విషయం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: