
తాజాగా ఇప్పుడు ఏపీ సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన పూనమ్ పెట్టిన ట్విట్ హాట్ టాపిక్ గా మారుతోంది.. కరోనా మహమ్మారి విస్తరించిన సమయంలో చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం వైసీపీ అండగా నిలిచిందని వారికోసం ఎన్నో పనులు చేశారని చేనేత కార్మికుల సమస్యల పైన పరిశీలించిన ఒక కార్యకర్తగా ఇది చెబుతున్నాననీ ఈ విషయం చాలా గొప్పది అంటూ ట్విట్టర్లో తెలియజేసింది..
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. సీఎం జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైసిపి కార్యకర్తలు ఈ పోస్టును తెగ లైకులు కామెంట్లతో వైరల్ గా చేస్తున్నారు.. మరి కొంత మంది టిడిపి జనసేన నేతలు మాత్రం ఈమెను ట్రోల్ చేస్తూ ఉన్నారు.. ఏది ఏమైనా ఏపీలోని అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ పూనమ్ కౌర్ చేసిన ఈ ట్వీట్ చాలా ప్రాధాన్యతగా మారుతోంది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఈమె గత రెండేళ్లుగా ఫైబ్రోమైయాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియజేసింది.. దీనివల్ల ఏదైనా దుస్తులు వేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చికిత్స తర్వాత కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు ఈ ముద్దుగుమ్మ వెల్లడించింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పైన చేసిన ట్వీట్ వైరల్ గా మారుతోంది.