ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. అటు పార్లమెంటు ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో లేదో అప్పటివరకు బిఆర్ఎస్ పార్టీతో స్నేహపూర్వకంగా మెలిగిన ఎంఐఎం  కాంగ్రెస్ తో దోస్తీ పెట్టుకుంది. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎంతో ఉన్న దోస్తి విషయంలో  ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారట. ఆ పార్టీతో స్నేహం నటిస్తూనే మరోవైపు లోపకాయారి ఒప్పందం చేసుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నాడు అన్నది ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అనిపిస్తుంది.



 అయితే ఎంఐఎం పార్టీతో తమకు స్నేహం ఉందని హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆ పార్టీతో ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పారు. కానీ నిజానికి స్నేహపూర్వక పోటీ కాదు కుదిరితే వారి కంచుకోట  హైదరాబాద్లోనే ఎంఐఎం ను  ఓడించాలని కాంగ్రెస్ భావిస్తుందట. ఇక దీనికోసం హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లో ఎంఐఎం కు పోటీగా భావిస్తున్న మజిలీస్ బచావో తెహరిక్ పార్టీతో కాంగ్రెస్ ఒప్పందం కోసం చర్చలు జరుపుతుందట. కాగా ఎంబిటీ పార్టీకి హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మూడు చోట్ల బలమైన ఓటు బ్యాంకు ఉంది.


 ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మైనారిటీల మద్దతు ఉండనే ఉంది. దీంతో ఎంబిటీతో పొత్తు పెట్టుకుంటే ఇక మజిలీస్ పార్టీని ఏకంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో ఓడించేందుకు అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ అనుకుంటున్నాడట. ఇలా ఎంఐఎం ను వారి సొంత గడ్డమీద ఓడిస్తే మైనార్టీ ఓటు బ్యాంకు మరింత బలపడుతుందని లెక్కలు కూడా వేసుకుంటున్నారట. అదే సమయంలో ఎంఐఎం ను గుడ్డిగా నమ్మలేమని.. అధికారంలో ఉన్న పార్టీతో ఎప్పుడు స్నేహం నటిస్తుంది తప్ప.. నిజమైన భాగస్వామిగా ఏ పార్టీని భావించదని కాంగ్రెస్ పెద్దలు కూడా విశ్వసిస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమ్ఐఎంతో స్నేహపూర్వక పోటీ ఉంది అని రేవంత్ చెప్పినప్పటికీ.. లోలోపల మాత్రం మరో మాస్టర్ ప్లాన్ తో ముందుకు సాగుతున్నారట సీఎం. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: