తెలంగాణలో బిఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కడతారని చాలామంది నమ్మలేదు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇది నిజం అయింది. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వహాత్మకంగా వ్యవహరించి అధికారాన్ని దక్కించుకుంది. అయితే గెలిచిన అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ తేడాతో విజేయడంకా మోగించి ప్రభంజనం సృష్టించింది. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అవ్వబోతుందా అంటే మాత్రం పరిస్థితులు చూస్తూ ఉంటే అవును అనే మాటే ఎక్కువగా వినిపిస్తుంది.



 మరీ ముఖ్యంగా మహబూబాబాద్ నియోజకవర్గంలో ఒకప్పుడు దారుణ ఓటమిని చవిచూసిన నాయకుడే.. ఇక ఇప్పుడు ఘనవిజయాన్ని సాధించబోతున్నాడు అని పార్టీ శ్రేణులు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత కాంగ్రెస్ నుంచి పోరిక బలరాం నాయక్ పోటీ చేసారు. ఈ ఎన్నికల్లో బలరాం నాయక్ మాలోత్ కవిత చేతిలో 1,40,000 పైచిలుకు  ఓట్లతో ఓడిపోయారు. కానీ ఇప్పుడు ఇది రివర్స్ కాబోతుందా అంటే అవును అంటున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.


 ఒకవైపు ఎంపీగా ఎన్నికైన తర్వాత మాలోత్ కవిత ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడంతో.. ప్రజల్లో ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక అదే సమయంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని ఏడు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ఘనవిజయాన్ని సాధించింది. దీని బట్టి అక్కడ ఓటర్లు కాంగ్రెస్ వైపే ఉన్నారు అన్నది అర్థమవుతుంది. ఇలా బిఆర్ఎస్ అభ్యర్థి పై ఉన్న వ్యతిరేకత.. గత అసెంబ్లీ  ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన పట్టు చూస్తుంటే.. మాలోత్ కవిత పై పోరిక బలరాం నాయక్ దాదాపు 2 లక్షల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు. అయితే గెలుపు కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. అంతిమ తీర్పు మాత్రం ఓటర్లది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tg