మైలవరం అసెంబ్లీ స్థానానికి సంబంధించి టిడిపి పార్టీకి పెద్ద తలనొప్పి ఎదురయింది. టిడిపి పార్టీలో చాలా రోజుల నుండి కొనసాగుతున్న దేవినేని ఉమా మొదట నుండి ఈ నియోజక వర్గం లో సీటును ఆశించారు. ఈయనతో పాటు ఈ నియోజక వర్గం నుండి బొమ్మసాని సుబ్బారావు కూడా టిడిపి పార్టీ టికెట్ ను ఆశించారు. ఇలా వీరిద్దరి మధ్య వర్గ పోరు జరుగుతున్న సమయం లోనే వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనూహ్యంగా టిడిపి పార్టీలోకి చేరారు. వసంత టిడిపి పార్టీలోకి చేరడంతో ఒక్క సారిగా మైలవరం టిడిపి క్యాడర్ మూడు వర్గాలుగా చీలిపోయింది.

ఇలా మూడు వర్గాలుగా చీలిపోయిన సమయం లోనే బొమ్మ సాని సుబ్బారావు ,  వసంత కు కనక సీట్ ను ఇచ్చినట్లు అయితే ఆయన ఓడిపోతారు అని వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ ఆ తర్వాత వసంత పార్టీ టికెట్ దక్కనీ వారిని కలిసి బుజ్జగింపలు మొదలు పెట్టాడు. అందులో భాగంగా బొమ్మసని కాస్త మెత్త పడి వసంత కు సపోర్టుగా నిలిచాడు.

ఇక ఇప్పటికే మైలవరం టికెట్ ను టిడిపి పార్టీ వసంత కు ఇచ్చివేయడంతో భూమినేని ఉమా మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. ఆయన ప్రస్తుతం తనకు సంబంధించిన వ్యక్తులకు కూడా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు అని తెలుస్తుంది. వసంత ఎంట్రీతో మూడు వర్గాలుగా చీలిపోయిన టిడిపి క్యాడర్ ఆ తర్వాత బొమ్మసాని , వసంత కు సపోర్ట్ గా నిలవడంతో రెండు వర్గాలుగా మారింది.

ఇకపోతే వసంత అందరిని కలుపుకుపోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే దేవినేని ఉమా ను కూడా కలిసి పరిస్థితిని వివరించబోతున్నట్లు సమాచారం. ఒక వేళ దేవినేని కూడా వసంత మాటలకు తగ్గినట్లు అయితే మైలవరం అసెంబ్లీ స్థానంలో వసంత కు టిడిపి పార్టీ నుండి పూర్తి సపోర్టు దక్కి అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: