ఏపీలో తెలుగుదేశం పార్టీతో బీజేపీ , జ‌న‌సేన రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని.. ఓవ‌రాల్‌గా మూడు పార్టీలు క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మూడు పార్టీల్లో చాలా మంది కీల‌క నేత‌ల‌తో పాటు సీనియ‌ర్ నేత‌ల‌కు సీట్లు ద‌క్క‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలోనే ఏలూరు పార్ల‌మెంటు సీటు విష‌యంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సీటు కోసం టీడీపీ నుంచి చాలా మార్పులు చోటు చేసుకునేలా టీడీపీ వ్య‌వ‌హ‌రించింది. టీడీపీలో మాజీ ఎంపీ మాగంటి బాబుతో పాటు బీసీ నేత గోరుముచ్చు గోపాల్ యాద‌వ్ ఇద్ద‌రు సీటు ఆశించారు.

అయితే చంద్ర‌బాబు వీరిని కాద‌ని నాన్ లోక‌ల్ అయిన క‌డ‌ప జిల్లాకు చెందిన పుట్టా మ‌హేష్ యాద‌వ్‌కు సీటు కేటాయించారు. అయితే ఇదే సీటును బీజేపీ నుంచి సీనియ‌ర్ నేత‌, ఆర్ ఎస్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న గార‌పాటి త‌న‌ప చౌద‌రి.. త‌ప‌న చౌద‌రి కూడా ఆశించారు. అయితే ఇప్పుడు ఆయ‌న ఈ సీటు ద‌క్క‌క పోవ‌డంతో తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. సీటు రాక‌పోవ‌డంతో త‌ప‌న చౌద‌రి పొత్తు ధ‌ర్మం వ‌దిలేసి మ‌రీ తాను పోటీ చేస్తాన‌ని చెపుతున్నారు.

త‌ప‌న చౌద‌రి గ‌త 15 ఏళ్లుగా ఏలూరు పార్ల‌మెంటు సీటు ప‌రిధిలో ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేసుకుంటూ వ‌స్తున్నారు. గ‌త నాలుగేళ్లుగా ఆయ‌న ఎన్నో సేవా ధార్మిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ఈ సారి ఏలూరు పార్ల‌మెంట‌కు పోటీ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. పార్టీల‌తో సంబంధం లేకుండా హిందూత్వ నినాదంతో బాగా పాపుల‌ర్ అయిన త‌ప‌న చౌద‌రికి పార్టీలు, కులాలు, మ‌తాల‌తో సంబంధం లేకుండా ఆయ‌న‌కు మంచి పేరు ఉంది.

ఇక ఇప్పుడు త‌ప‌న చౌద‌రి ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా టీడీపీ క్యాండెట్ కు దెబ్బ ప‌డిపోతుంద‌ని.. చాలా ఊళ్ల‌ల్లోనూ, ప‌ట్ట‌ణాల్లోనూ ఓట్లు చీలిపోతాయ‌ని అంటున్నారు. మ‌రి త‌ప‌న చౌద‌రి పొత్తు ధ‌ర్మం పాటిస్తారా ?  లేదా ఇండి పెండెంట్ గా అయినా పోటీ లో ఉంటారా ? అన్న‌ది చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: